Health: రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగేయండి.. లాభాలు ఎలా ఉంటాయంటే..

|

Oct 27, 2024 | 8:13 AM

జీలకర్ర ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకుంటే రెట్టించిన లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ జీలకర్ర నీటిని తీసుకంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగేయండి.. లాభాలు ఎలా ఉంటాయంటే..
Jeera Water
Follow us on

ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వాటిలో జీలకర్ర ఒకటి. జీలకర్ర లేకుండా వంటను చేయరనే విషయం తెలిసిందే. జీలకర్రలో అలాంటి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టే.. మన నిత్య జీవితంలో వీటిని ఒక భాగం చేసుకుంటాం. జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమ్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* డయాబెటిస్‌ బాధితులకు ఈ నీరు దివ్యౌషధంగా చెప్పాలి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో ఇది బాగా ఉపయోపగుడుతంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.

* బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారా.? అయితే ప్రతీ రోజూ జీలకర్ర నీటిని తీసుకోండి. దీనివల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. ఉదయ ఖాళీ కడుపుతో జీలకర్ర నానబెట్టిన నీటిని తాగితే వేగంగా కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో దోహదపడుతుంది.

* రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల తరచూ వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జీలకర్రలోని ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, పొటాషియం శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడుతుంది.

* అజీర్ణం సమస్యతో బాధపడేవారికి కూడా జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి ఎన్నో సమస్యలకు జీలకర్ర నీరు బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కూడా జీలకర్ర నీరు బాగా పనిచేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతీ రోజూ ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకుంటే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని అంటున్నారు.

* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా జీరా నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కాచి చల్లార్చిన జీరా నీటిని తీసుకుంటే.. ప్రశాంతంగా నిద్రపడుతుంది. శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. అంతేకాకుండా నిద్ర నాణ్యత సైతం పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..