ఆరెంజ్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

|

Aug 14, 2020 | 10:33 PM

రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వారు రీసెంట్ గా చేపట్టిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది.

ఆరెంజ్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Follow us on

Orange Juice Health Benefits: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వారు రీసెంట్ గా చేపట్టిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. ఈ మేరకు సదరు పరిశోధనలకు చెందిన వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లోనూ ప్రచురించారు. నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువ ఉంటాయని… అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందట. అయితే కేవలం ఆరెంజ్ జ్యూస్ మాత్రమే కాదు, ఇతర ఏ జ్యూస్‌ను అయినా నిత్యం తాగడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వాటిలో చక్కెర కలపకుండా తాగితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!