చిప్స్, పాప్‌కార్న్ ఎక్కువ తింటే ఆ ఇబ్బందులు తప్పవా?

|

Aug 18, 2020 | 2:25 AM

Eating Popcorn Effects Your Health: చిప్స్ ఎక్కువగా తింటే అంతే…చిప్స్, పాప్‌కార్న్‌లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా బరువు విషయంలో తేడాలు వస్తాయి. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీ వాళ్లు జరిపిన ఒక పరిశోధన ప్రకారం చిప్స్, పాప్‌కార్న్‌ తినే విషయంలో నిబంధనలను ఎక్కవ మంది పాటించడంలేదని, ఇది ప్రమాదమని తేల్చారు. బ్రిటన్‌లో అయితే ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. […]

చిప్స్, పాప్‌కార్న్ ఎక్కువ తింటే ఆ ఇబ్బందులు తప్పవా?
Follow us on

Eating Popcorn Effects Your Health: చిప్స్ ఎక్కువగా తింటే అంతే…చిప్స్, పాప్‌కార్న్‌లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా బరువు విషయంలో తేడాలు వస్తాయి. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీ వాళ్లు జరిపిన ఒక పరిశోధన ప్రకారం చిప్స్, పాప్‌కార్న్‌ తినే విషయంలో నిబంధనలను ఎక్కవ మంది పాటించడంలేదని, ఇది ప్రమాదమని తేల్చారు. బ్రిటన్‌లో అయితే ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు.

గాలి ఎక్కువగా పీలిస్తే..గాలి ఎక్కువగా పీలిస్తే అది మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇజ్రాయేల్‌లో జరిగిన ఒక తాజా పరిశోధనలో ఇది తెలుసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే ముందు కొంత మంది విద్యార్ధులను దీర్ఘ శ్వాసలు తీసుకోమని చెప్పారు. ఇంకొందరు ఆ విధంగా ఎలాంటి శ్వాసలు తీసుకోకుండానే పరీక్ష రాశారు. ఈ ప్రయోగంలో దీర్ఘ శ్వాసలు తీసుకున్న వారు పరీక్షను బాగా రాసి మంచి ఫలితాలను సాధించారు.

పసుపుతో అద్భుతాలు…మనం రోజూ ఇంట్లో వాడుకునే పసుపులో అద్భుత ఆరోగ్య రహస్యం ఉంది. పసుపుతో వెన్నుముక గాయాలు సైతం మటుమాయమైపోతాయి. ఎలాంటి గాయమైన తొందరగా తగ్గేందుకు పసుపు బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా జలుబు కూడా నివారణ అవుతుంది.