అమ్మాయిలు ఈ 5 అలవాట్లు ఉన్న అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు..! ఎందుకంటే..?

|

Sep 28, 2021 | 5:43 PM

Girls And Boys : అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. వారికంటూ కొన్ని అభిప్రాయాలు,

అమ్మాయిలు ఈ 5 అలవాట్లు ఉన్న అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు..! ఎందుకంటే..?
Girls And Boys
Follow us on

Girls And Boys : అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. వారికంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిల అందం కంటే వారి అలవాట్లను ఎక్కువగా గమనిస్తారు. ఎల్లప్పుడు భద్రతను కోరుకుంటారు. అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావాలంటే వారు కచ్చితంగా ఈ 5 అలవాట్లను వదిలేయాలి.

1. కబుర్లు చెప్పేవారు
అమ్మాయిలు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవారిని దగ్గరికి కూడా రానివ్వరు. ఇలాంటి అబ్బాయిలను జులాయిగా భావిస్తారు. సమయం, సందర్భాన్ని బట్టి వ్యవహరించాలని కోరుకుంటారు. వారి గురించి వీరి గురించి ఉన్నది లేనట్లు చెప్పే వ్యక్తులను వారు ప్రమాదకరంగా భావిస్తారు.

2. గొడవలు పడటం
అమ్మాయిల ముందు అబ్బాయిలు గొప్పగా కనిపించాలని భావిస్తారు. కానీ అమ్మాయిలు ఇటువంటి ప్రవర్తన గలవారిని ఇష్టపడరు. అంతేకాదు మాట్లాడే విషయంలో గొడవపడే అబ్బాయిలను కూడా తిరస్కరిస్తారు. అమ్మాయిలు తమ భద్రత, ఆత్మరక్షణ కోసం పోరాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.

3. నెగిటివ్ థింకింగ్
అమ్మాయిలు నెగిటివ్‌గా ఆలోచించే అబ్బాయిలను ఇష్టపడరు. ప్రతి విషయానికి కంగారుపడుతూ, భయపడే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. వారు ఎల్లప్పుడు మానసికంగా ధృడమైన వ్యక్తిని కోరుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తనను సేవ్‌ చేస్తాడని భావించే వ్యక్తులను ఎంచుకుంటారు.

4. అబద్ధాలు
అమ్మాయిలు అబద్ధాలు చెప్పే వ్యక్తులను ఎప్పుడు ఇష్టపడరు. వారిపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తులను అస్సలు సహించరు. అంతేకాదు వారికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

5. సిగరెట్లు, మద్యం

సిగరెట్లు, మద్యం మొదలైన అలవాట్లున్న అబ్బాయిలను.. అమ్మాయిలు నాలుగు అడుగుల దూరంలో ఉంచుతారు. వారిని బాధ్యత లేని అబ్బాయిలుగా పరిగణిస్తారు. ఎందుకంటే తాగిన మైకంలో వారు తప్పులు చేస్తారు అందుకే వారికి దూరంగా ఉంటారు.

YouTube: యూట్యూబ్‌లో ఆత్మహత్య వీడియోను తల్లికి చూపించిన మైనర్ బాలిక.. తెల్లవారేసరికి షాక్..!

Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

Samantha: ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’.. వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్