పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో 5 నుండి 6 చుక్కల తులసి రసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన ఆరోగ్య మార్పులు జరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ రెండింటి కలయిక వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తీసుకుని గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ సమస్యలు తొలగిపోయి శరీరం, మనస్సు లభిస్తాయి. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Ghee And Tulsi Juice

Updated on: Sep 29, 2026 | 8:05 AM

ఆయుర్వేదంలో తులసి, ఆవు నెయ్యికి ఎంతో ఆధ్యాత్మిక, వైద్య ప్రాముఖ్యత ఉంది. ఉదయం లేవగానే మనం తీసుకునే మొదటి ఆహారం రోజంతా మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం, పరగడుపున ఒక స్పూన్ వేడి నెయ్యిలో కొన్ని చుక్కల తులసి రసాన్ని కలిపి తీసుకోవడం అద్భుతమైన డిటాక్స్ ప్రక్రియగా పనిచేస్తుంది.

ఈ మిశ్రమం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:

ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండే త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను సమతుల్యంలో ఉంచడానికి ఈ తులసి-నెయ్యి మిశ్రమం అద్భుతంగా తోడ్పడుతుంది. తులసిని మూలికల తల్లి అని పిలుస్తారు. ఇందులో ఉండే యాంటీ-బాక్టీరియల్, యాంటీ-వైరల్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి తరచూ వచ్చే జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను అరికడతాయి. పరగడుపున ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ప్రేగులలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణక్రియ శక్తి పెరిగి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. నెయ్యి శరీరంలోని కీళ్లకు అవసరమైన లూబ్రికేషన్ ను అందిస్తుంది. చర్మాన్ని సహజ సిద్ధంగా కాంతివంతంగా, మృదువుగామారుస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి?

ఉదయాన్నే 10 తులసి ఆకులను శుభ్రంగా కడిగి, నలిపి 5 నుండి 6 చుక్కల రసాన్ని తీయండి. ఒక టీస్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోండి. ఈ రెండింటినీ ఒక పాత్రలో కలిపి, కేవలం 30 సెకన్ల పాటు స్వల్పంగా వేడి చేయండి. ఇది గోరువెచ్చగా మారిన తర్వాత నేరుగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తిన్న వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఈ సులభమైన గృహ వైద్యం మన శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఉత్సాహాన్ని అందిస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ చిన్న అలవాటును చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us