వెల్లుల్లి పొట్టుని పడేస్తున్నారా.. ఆ వ్యాధికి అది బ్రహ్మాస్త్రమని మీకు తెలుసా?

| Edited By: Janardhan Veluru

May 13, 2024 | 9:05 AM

కూరలు, సూప్స్, పచ్చళ్లు వంటి రకరకాల ఆహార పదార్ధాల్లో వెల్లుల్లిని జోడిస్తారు. ఔషధాల గని వెల్లుల్లిని ఉపయోగించే ముందు వాటి తొక్కలను తీసివేస్తారు. అయితే వెల్లుల్లి పాయలు మాత్రమే కాదు వెల్లులి తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలున్నాయి.. వాటిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు అని కొంతమంది మాత్రమే తెలుసు.. ఈ రోజు వెల్లుల్లి పొట్టుతో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. 

వెల్లుల్లి పొట్టుని పడేస్తున్నారా.. ఆ వ్యాధికి అది బ్రహ్మాస్త్రమని మీకు తెలుసా?
Garlic Peels Benefits
Follow us on

భారతీయుల ఆహారంలో మాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రుచిని, వాసనను పెంచడానికి    వెల్లుల్లిని ఉపయోగిస్తారు. కూరలు, సూప్స్, పచ్చళ్లు వంటి రకరకాల ఆహార పదార్ధాల్లో వెల్లుల్లిని జోడిస్తారు. ఔషధాల గని వెల్లుల్లిని ఉపయోగించే ముందు వాటి తొక్కలను తీసివేస్తారు. అయితే వెల్లుల్లి పాయలు మాత్రమే కాదు వెల్లులి తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలున్నాయి.. వాటిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు అని కొంతమంది మాత్రమే తెలుసు.. ఈ రోజు వెల్లుల్లి పొట్టుతో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

వెల్లుల్లి పొట్టులో ఉండే పోషకాలు:

వెల్లుల్లి పొట్టులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా  శతాబ్దాలుగా వెల్లుల్లిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లిని ఉపయోగించి తొక్కలను పడేస్తుంటే.. ఆ వెల్లుల్లి తొక్కల పొడిని తయారు చేసి మసాలా పిజ్జా, పాస్తాలో ఉపయోగించవచ్చు, ఇది ఉబ్బసం, పాదాల వాపు నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

వెల్లుల్లి పొట్టు చర్మ సమస్యల నుండి ఉపశమనం:

తామర లేదా దురద వంటి చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు, వెల్లుల్లి తొక్కలు ప్రయోజనకరంగా ఉంటాయి. దీని కోసం వెల్లుల్లి పొట్టును నీటిలో కాసేపు నానబెట్టండి. దీని తరువాత ప్రభావిత ప్రాంతంపై ఈ నీటిని పూయండి. ప్రతిరోజూ ఈ పరిహారం చేయడం ద్వారా దురద సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

జుట్టు సమస్యల నివారణకు:

జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే లేదా తలకు సంబంధించిన ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వెల్లుల్లి పొట్టు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం వెల్లుల్లి తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆపై ఈ నీటితో జుట్టుని వాష్ చేయాలి. లేదా స్ప్రే బాటిల్‌లో ఉంచి కూడా ఉపయోగించవచ్చు.

పాదాల వాపు నుంచి ఉపశమనం:

పాదాల వాపును తగ్గించడానికి అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు వెల్లుల్లి పొట్టును ఉపయోగించడం ద్వారా కూడా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నివారణ కోసం, వెల్లుల్లి పొట్టును నీటిలో ఉడకబెట్టండి, నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు పాదాలను కొంత సమయం పాటు అందులో ముంచండి. క్రమంగా  పాదాలలో వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి పీల్స్ తో సూప్ :

వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.  వెల్లుల్లి తొక్కలను కూర తయారీకి, మసాలా తయారీకి, ఆరోగ్య మూలికగా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి తొక్కలను సూప్‌లో ఉపయోగించడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా సూప్‌లోని పోషక విలువలు కూడా పెరుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..