AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: పతంజలితో అద్భుతం.. 70కిలోల బరువు తగ్గిన యువతి.. ఎలా అంటే..?

యోగాతో పాటు ఆయుర్వేదాన్ని ప్రజలకు మళ్లీ చేరువ చేస్తున్నారు బాబా రామ్‌దేవ్. తన పతంజలి సంస్థతో ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పతంజలి ఉత్పత్తులను ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. కానీ పతంజలితో ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా..?

Patanjali: పతంజలితో అద్భుతం.. 70కిలోల బరువు తగ్గిన యువతి.. ఎలా అంటే..?
Patanjali Weight Loss
Krishna S
|

Updated on: Sep 12, 2025 | 2:49 PM

Share

పురాతన ఆయుర్వేద సంప్రదాయాలకు భారత్‌ పుట్టినిల్లు. అయితే కొంతకాలంగా ఆయుర్వేదాన్ని ప్రజలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. దానికి కారణం బాబా రామ్‌దేవ్. బాబా రామ్‌దేవ్ తన పతంజలి సంస్థతో ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారం, ఆయుర్వేద ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. దీంతో ఈ ఆధునిక యుగంలో చాలా మంది ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తున్నారు. నేటి కాలంలో బరువు పెరగడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. ముఖ్యంగా యువత, పిల్లల ఊబకాయం బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యకు పతంజలి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది దీనిని పాటించి తమ బరువును తగ్గించుకుని ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

యూకేకు చెందిన పూజ.. పతంజలి మార్గాన్ని అనుసరించి అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆమె తన బరువును 125 కిలోల నుండి 55 కిలోలకు తగ్గించుకుంది. అంటే పతంజలితో సుమారు 70 కిలోల బరువు తగ్గింది. పూజ బరువు తగ్గడానికి ఫుడ్ మానయలేదు. కానీ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహార విధానాన్ని పాటించింది. ఆమె తన దినచర్యలో పతంజలి ఉత్పత్తులను చేర్చింది. గోరింటాకు రసాన్ని కూడా క్రమం తప్పకుండా తీసుకునేది. ఆమె కేవలం ఆహారంతో మాత్రమే కాకుండా శారీరక శ్రమను కూడా తన దినచర్యలో భాగంగా చేసుకుంది. పూజ జాగింగ్, ప్రాణాయామం, సూర్య నమస్కారం చేసేది. బాబా రామ్‌దేవ్ ప్రకారం.. ఈ రకమైన దినచర్యను పాటించడం వలన బరువు తగ్గడం సులభం.

పూజ మాత్రమే కాదు మరెందరో పతంజలి మార్గం అనుసరించి బరువు తగ్గారు. ముంబైకి చెందిన పూజ అగర్వాల్ కూడా పతంజలి కేంద్రానికి వెళ్లి, అక్కడ చెప్పిన సలహాలు, సూచనలు పాటించి 100 కిలోలు ఉన్న తను.. క్రమంగా బరువు తగ్గింది. అలాగే రోహన్ గాంధీ అనే వ్యక్తి 172 కిలోల నుండి 95 కిలోలకు వచ్చారు. బరువు తగ్గడం ద్వారా ఆరోగ్యకరమైన, ఫిట్ జీవితాన్ని గడపాలనుకునే వారికి పతంజలి యొక్క ఈ కథలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.