మార్కెట్ వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే రుచికరమైన అప్పడాలను చేయండిలా !

|

Jan 16, 2025 | 6:47 PM

భోజనం చేసాక కడుపు ఫుల్ అయినా ఫీలింగ్ రావాలి అంటే మనం తినే భోజనం వేళ అప్పడాలు ఉండాల్సిందే. కానీ మార్కెట్ ప్రతీ సారి వెళ్లి తెచ్చుకోలేముగా.. అలాంటి వారి కోసమే చిన్న వంటకం. మినపపిండితో ఇంట్లోనే కరకరలాడే అప్పడాలను సులభంగా తయారు చేయండి. ఒక కప్పు మినపపిండితో సుమారుగా 50 అప్పడాలను తయారుచేసుకోవచ్చు. పైగా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే.

మార్కెట్ వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే రుచికరమైన అప్పడాలను చేయండిలా !
Tasty Papads
Follow us on

మన ఇంట్లో సాధారణంగా సాంబర్ చేసినప్పుడు లేదా పప్పులతో పలు రకాల వంటకాలు చేసినప్పుడు మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అప్పడాలు. ఇవి లేకపోతే భోజనం చేసినా కడుపు ఫుల్ అయినా ఫీలింగ్ రాదు. అందుకే దాదాపు అందరి ఇళ్లలో అప్పడాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లోనే తయారు చేస్తారు. మరికొంత మంది మార్కెట్లో నుండి కొనుగోలు చేస్తారు. ఇలాంటి వారి కోసమే నేను సింపుల్ రెసిపీని తెచ్చాను. ఈ వంటకాన్ని ఎవరైనా ఈజీగా చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కప్పు మినపపిండితో సుమారుగా 50 అప్పడాలను తయారుచేసుకోవచ్చు. పైగా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే

అప్పడాల తయారికి కావాల్సిన పదార్థాలు

మినపపిండి
బేకింగ్ సోడా
ఉప్పు
నువ్వుల నూనె

తయారీ విధానం

250 గ్రాముల తెల్ల మినపపప్పును తీసుకుని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా పట్టిన మినపపిండి పౌడర్‌కు ¾ టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి. మినపపిండి నీటిని ఎక్కువగా పీలుచుకుంటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే నీరు వేసుకోవాలి. పిసుకుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కలిపితే ముద్ద మృదువుగా అవుతుంది. ముద్ద సిద్ధమైపోయిన తర్వాత దాన్ని 8 సమాన ముద్దులుగా విభజించాలి. ప్రతి ముద్దను చపాతీలా పలుచగా చేయాలి. అరకుప్పు మైదా పిండి చల్లి పొరలా పలచగా తేలికగా చేసిన తర్వాత డబ్బా మూత లేదా చిన్న గ్లాస్‌తో రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన అప్పడాలను వెళ్తురు బాగా ఉండే చోట, ఎండ ఉన్న చోట ఉంచి బాగా ఎండబెట్టాలి. ఎండి విరిగిపోయే దశకు వచ్చే వరకు ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన అప్పడాలను నూనెలో వేడి చేసి కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే సులభంగా రుచికరమైన అప్పడాలను తయారుచేసి తింటూ ఆనందించండి.