Vankaya Vepudu: వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

| Edited By: Shaik Madar Saheb

Aug 04, 2024 | 1:51 PM

కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్ని వెరైటీలు తయారు చేసుకోవచ్చేంటే అన్ని తయారు చేసుకోవచ్చు. వంకాయతో ఎలాంటి వంటలు చేసినా రుచి అదిరిపోవాల్సిందే. వంకాయలో రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుత్తి వంకాయ గురించి చెప్పాల్సిన పని లేదు. వంకాయలో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలని నిపుణులు..

Vankaya Vepudu: వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
Vankaya Vepudu
Follow us on

కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్ని వెరైటీలు తయారు చేసుకోవచ్చేంటే అన్ని తయారు చేసుకోవచ్చు. వంకాయతో ఎలాంటి వంటలు చేసినా రుచి అదిరిపోవాల్సిందే. వంకాయలో రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుత్తి వంకాయ గురించి చెప్పాల్సిన పని లేదు. వంకాయలో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే వంకాయ వేపుడు ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్క, పులావ్ ఎలా తిన్నా సూపర్ అని చెప్పొచ్చు. మరి ఇంత రుచిగా ఉండే స్పెషల్ వంకాయ వేపుడు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్పెషల్ వంకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, నెయ్యి, కొత్తి మీర, కరివేపాకు.

వంకాయ వేపుడు తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఇవి వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు వేసి వేడి వేయించండి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించండి. ఇవి దగ్గర పడ్డాక.. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉప్పు, కారం, పసుపు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి.

ఇవి కూడా చదవండి

కారాలన్నీ వేగాక.. ఆయిల్ పైకి తేలని తర్వాత కొత్తి మీర వేసి చల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు సిద్ధం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఈ స్టైల్‌లో మీరు కూడా ఓసారి వంకాయ వేపుడు చేయండి. చాలా రుచిగా ఉంటుంది.