Oats Masala Vada: ఓట్స్‌తో మసాలా గారెలు.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపీ..

|

Aug 29, 2024 | 7:12 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓట్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓట్స్‌తో బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ వంటివి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. హెల్దీ బ్రేక్ పాస్ట్ తినాలి అనుకునేవారు.. ఈ ఓట్స్ మసాలా వడలను ట్రై చేయవచ్చు. ఇవి ఎంతో క్రంచీ అండ్ క్రిస్పీ, టేస్టీగా ఉంటాయి. వీటిని అప్పటికప్పుడు..

Oats Masala Vada: ఓట్స్‌తో మసాలా గారెలు.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపీ..
Oats Masala Garelu
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తీనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓట్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓట్స్‌తో బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ వంటివి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. హెల్దీ బ్రేక్ పాస్ట్ తినాలి అనుకునేవారు.. ఈ ఓట్స్ మసాలా వడలను ట్రై చేయవచ్చు. ఇవి ఎంతో క్రంచీ అండ్ క్రిస్పీ, టేస్టీగా ఉంటాయి. వీటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా చాలా సులభం. పైగా ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ మసాలా గారెలను ఎలా తయారు చేసుకోవచ్చు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓట్స్ మసాలా గారెలకు కావాల్సిన పదార్థాలు:

ఓట్స్, పెరుగు, బియ్యం పిండి, మిరియాల పొడి, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు, ఆయిల్.

ఓట్స్ మసాలా గారెలు తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ని ఓ నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పొడిగా రుచి బాగోదు అనుకుంటే కొద్దిగా ఓటర్ వేసి ఓట్స్ నానబెట్టండి. దీంతో వాటర్ వేయకుండా పేస్టు తయారు చేసుకోవచ్చు. ఇందులో పెరుగు, బియ్యం పిండి, మిరియాల పొడి, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. నూనె వేడి చేశాక.. ఇందులో మీకు నచ్చిన షేపులో గారెలను వత్తుకుని వేయండి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చట్నీలతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి.