Broccoli 65: హెల్దీ బ్రకోలీతో 65.. ఎవ్వరైనా సరే తినేస్తారు..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 9:30 PM

బ్రకోలీ కూడా కాలీఫ్లవర్ జాతికి చెందినదే. కానీ కాలీ ఫ్లవర్ కంటే బ్రకోలీ‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. బ్రకోలీని ఎలా తీసుకున్నా కూడా మీకు పోషకాలు లభిస్తాయి. అయితే బ్రకోలీ నేరుగా తినడం ఇష్టం లేనివారు ఇలా వెరైటీగా బ్రకోలీ 65 కూడా ట్రై చేయవచ్చు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు కూడా లాగించేస్తారు. ఇది తయారు చేయడం కూడా చాలా..

Broccoli 65: హెల్దీ బ్రకోలీతో 65.. ఎవ్వరైనా సరే తినేస్తారు..
Broccoli 65
Follow us on

బ్రకోలీ కూడా కాలీఫ్లవర్ జాతికి చెందినదే. కానీ కాలీ ఫ్లవర్ కంటే బ్రకోలీ‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. బ్రకోలీని ఎలా తీసుకున్నా కూడా మీకు పోషకాలు లభిస్తాయి. అయితే బ్రకోలీ నేరుగా తినడం ఇష్టం లేనివారు ఇలా వెరైటీగా బ్రకోలీ 65 కూడా ట్రై చేయవచ్చు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు కూడా లాగించేస్తారు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభమే. తక్కువ సమయంలోనే ఈ వంట పూర్తి అవుతుంది. మరి బ్రకోలీ 65 ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్రకోలీ 65కి కావాల్సిన పదార్థాలు:

బ్రకోలీ, కార్న్ ఫ్లోర్, శనగ పిండి, బియ్యం పిండి, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చి మిర్చి.

బ్రకోలీ 65 తయారీ విధానం:

బ్రకోలీ 65 తయారు చేయడానికి చాలా తక్కువ పదార్థాలే అవసరం అవుతాయి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేసుకోవాలి. ఈ లోపు బ్రకోలీని వేడి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో బ్రకోలీ, కార్న్ ఫ్లోర్, శనగ పిండి, బియ్యం పిండి, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చి మిర్చి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

కావాలి అంటే వీటిని మ్యారినేషన్ కోసం ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యిందో లేదో చూసుకుని.. ఇందులో బ్రకోలీని వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగాక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే బ్రకోలీ 65 సిద్ధం. కావాలి అనుకునేవారు వీటిని టాస్ కూడా చేసుకోవచ్చు.