AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్కు లాంటి బలం.. అందం డబుల్.. కోడి కాళ్ల మ్యాటర్ తెలిస్తే మెంటలెక్కిపోయిద్ది..

చాలామంది పక్కన పడేసే కోడి కాళ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడి కాళ్లు తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లు బలపడటంతో పాటు చర్మం కాంతివంతంగా మారడం, కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. అయితే వీటిని పరిమిత మోతాదులో, పరిశుభ్రంగా వండి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉక్కు లాంటి బలం.. అందం డబుల్.. కోడి కాళ్ల మ్యాటర్ తెలిస్తే మెంటలెక్కిపోయిద్ది..
Chicken Feet Benefits
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jul 31, 2026 | 9:32 AM

Share

చికెన్, మటన్, ఫిష్.. సాధారణంగా చాలామంది నాన్-వెజ్ ప్రియులు ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్ ను ఎక్కువగా తింటారు. అయితే.. కోడి కాళ్లను (Chicken Feet) తినడానికి మాత్రం.. చాలామంది ఇష్టపడరు. అయితే, 99 శాతం మందికి తెలియని విషయమేమిటంటే.. కోడి కాళ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడి కాళ్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడం, చర్మం కాంతివంతం కావడం, రోగ నిరోధక శక్తి పెరగడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆహార నిపుణుల ప్రకారం, కోడి కాళ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

బలమైన ఎముకలు: కోడి కాళ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా మారి, ఎముకలకు సంబంధించిన నొప్పులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఆర్థరైటిస్ నియంత్రణ: కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి కోడి కాళ్లు తినడం వల్ల అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. డాక్టర్ ఇచ్చే మందులతో పాటు వీటిని వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కండరాల పెరుగుదల (Muscles) – జిమ్‌కెళ్లే వారికి మేలు: జిమ్ చేసేవారు కండరాలు (Muscles) పెంచుకోవాలనుకుంటే కోడి కాళ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి, బరువులు ఎత్తే శక్తిని మరియు కండరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాయి.

చర్మ సౌందర్యం – యవ్వనం: కోడి కాళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మంపై ముడతలు పడకుండా టైట్‌గా ఉంచి, ఎక్కువ కాలం యవ్వనంగా (Young) కనిపించేలా చేస్తుంది.

నీరసం, రక్తం తక్కువగా ఉన్నవారికి ఔషధం: క్యాల్షియం, పోషకాలు లోపించి ఎప్పుడూ అలసట, నీరసం, కళ్లు తిరగడం, రక్తం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల త్వరలోనే కోలుకుంటారు.

పురుషుల ఆరోగ్య సమస్యలు: కోడి గుడ్లు, చికెన్‌లాగే కోడి కాళ్లు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, తుమ్ముల నుంచి ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

లైంగిక సమస్యలు: లైంగిక సమస్యలు ఉన్నవారు కోడి కాళ్లతో తయారు చేసిన సూప్ (Soup) తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే ఇన్ని ప్రయోజనాలున్న కోడి కాళ్లను పక్కన పడేయకుండా, వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు సూప్ రూపంలోనో లేదా వంటకంగానో తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు, చర్మం బలంగా మారి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us