Apple: యాపిల్‌ ముక్కలు రంగు మారొద్దంటే ఏం చేయాలి.? ఈ సింపుల్ టిప్స్‌తో..

|

Oct 22, 2024 | 12:20 PM

యాపిల్ ముక్కలు కోసి పక్కన పెడితే.. రంగు మారడం సర్వసాధారణమైన విషయం. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ యాపిల్ ముక్కల రంగు మారకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Apple: యాపిల్‌ ముక్కలు రంగు మారొద్దంటే ఏం చేయాలి.? ఈ సింపుల్ టిప్స్‌తో..
Apple
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్‌ తినాలని నిపుణులు సూచిస్తుంటారు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లొద్దంటే రోజూ ఒక యాపిల్‌ తినమని చెబుతుంటారు. యాపిల్‌ ఉండే ఎన్నో పోషక గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే యాపిల్‌ ముక్కలను కోసి కాసేపు పక్కన పెట్టగానే రంగు మారడం గమనించే ఉంటాం. క్షణాల్లో యాపిల్ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. అయితే గంటలతరబడి యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే. ముందుగా ఒ గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంత తేనె కలపాలి. అనంతరం కట్ చేసుకున్న ముక్కలు వేసి పక్కన పెట్టుకుంటే. యాపిల్‌ ముక్కల రంగు మారకుండా అలాగే ఉంటాయి.

* ఇక నిమ్మకాయ రసం కూడా యాపిల్‌ ముక్కల రంగు మారకుండా చూస్తాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొన్ని నిమ్మ చుక్కల రసం కలపాలి. ఆ తర్వాత యాపిల్ ముక్కలను అందులో వేస్తే రంగు మారకుండా ఉంటాయి. అయితే తినే సమయంలో మళ్లీ వేరే నీటితో కడిగేసి తింటే సరిపోతుంది.

* ఒక గిన్నెలో నీటిని తీసుకొని అందులో అరటీస్పూన్‌ ఉప్పును కలపాలి. ఆ తర్వాత అందులో యాపిల్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. రంగు మారకుండా అలాగే శుభ్రంగా ఉంటాయి. ఇందాక చెప్పినట్లే తినే ముందు ఫ్రెష్‌ వాటర్‌తో కడిగి తింటే సరిపోతుంది.

* సోడా కూడా యాపిల్ రంగు మారకుండా చూస్తుంది. ఒక గిన్నెలో సోడాను తీసుకొని అందులో యాపిల్ ముక్కలు వేసుకోవాలి. కొన్ని గంటలపాటు యాపిల్‌ కలర్‌ మారకుండా ఉంటుంది.

* ఇక యాపిల్‌ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే. గాలి చొరబడని ఒక డబ్బాను తీసుకోవాలి. అందులో యాపిల్‌ ముక్కలను పెట్టి గాలి వెళ్లకుండా చూడాలి. దీంతో ముక్కల రంగు మారకుండా ఉంటుంది.

* జిప్‌ ప్యాక్‌ ఉండే కవర్స్‌లో యాపిల్ ముక్కలు వేసుకున్నా రంగు మారకుండా ఉంటాయి. వీటిలో గాలి చొరబడకుండా ఉంటుంది. దీని సహాయంతో యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..