Paneer: మీరు వాడుతోంది అసలైన పన్నీరేనా.? ఎలా తెలుసుకోవాలంటే..

|

Oct 23, 2024 | 1:44 PM

ప్రస్తుతం మార్కెట్లో అన్ని కల్తీ అవుతున్నాయి. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిమరీ డబ్బులు సంపాదిస్తున్నారు. అలా కల్తీ చేస్తున్న వాటిలో పన్నీర్ ఒకటి. ఇంతకీ పన్నీర్ ను ఎలా కల్తీ చేస్తారు. అసలు కల్తీ పన్నీర్ ను ఎలా గుర్తించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Paneer: మీరు వాడుతోంది అసలైన పన్నీరేనా.? ఎలా తెలుసుకోవాలంటే..
Altered Paneer
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో వస్తువులన్నీ కల్తీ అవుతున్నాయి. కాసుల కక్కుర్తి కోసం కొందరు కేటుగాళ్లు అన్ని రకాల వస్తువులను కల్తీ చేస్తూ.. ప్రాణాల ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నాన్‌వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టపడి తినే పన్నీర్‌ను కూడా కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. ఇలాంటి పన్నీర్‌ తినడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కల్తీ పన్నీరును ఎలా తయారు చేస్తారు? కల్తీ పన్నీర్‌ను ఎలా గుర్తించాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పన్నీర్‌ను పాలతో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే కొందరు కల్తీగాళ్లు మాత్రం పాలకు బదులుగా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి తయారు చేస్తున్నారు. దీనిని అనలాగ్ పన్నీర్ లేదా సింథటిక్ పన్నీర్‌గా పిలుస్తారు. రుచిలో, చూడ్డానికి నిజమైన పన్నీర్‌లాగే ఉంటుంది. కానీ తింటే మాత్రం ఆరోగ్యం పాడవ్వడం ఖాయం. సాధారణ పన్నీర్‌తో పోల్చిన ఈ సింథటిక్‌ పన్నీర్‌ తయారీ సగం ధరకే అవుతుంది. ఈ కల్తీ పన్నీర్‌ వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్‌, కడుపుబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంగా ఈ కల్తీ పన్నీర్‌ తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కల్తీ పన్నీర్‌ ఎలా కనిపెట్టాలి.?

కాస్త పన్నీర్‌ను తీసుకొని వేళ్లతో నలిపి చూడాలి ఒకవేళ పన్నీర్‌ పిండిలాగా విరిగిపోతుంటే అది కల్తీ పన్నీర్‌గా భావించాలి. కల్తీ లేని పన్నీర్ అయితే అంత సులభంగా పిండిలా మారదు. దీనికి కారణం అసలైన పన్నీర్‌లో కొవ్వు ఉంటుంది కాబట్టి. ఇక కొంత పన్నీర్‌ను తీసుకొని నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత అందులో కందిపప్పు పొడి చేసి కాస్త కలపాలి. కాసేపటికి పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారితే అది యూరియా, లేదా డిటర్జెంట్ తో కల్తీ చేశారని అర్థం. ఇక నేరుగా పన్నీర్‌ రుచి చూసినా కల్తీదో మంచిదో తెలిసిపోతుంది. కాస్త కెమికల్‌ స్మెల్‌ వచ్చినా అందులో ఏదో కల్తీ చేశారని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం మేరకు మాత్రమే అందించడం జరిగింది. పూర్తి నిజానిజాల కోసం నిపుణులను సంప్రదించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..