Health: రోజూ ఉదయాన్నే చెప్పులు లేకుండా పావుగంట నడిస్తే చాలు..

|

Sep 20, 2024 | 7:01 PM

ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. కాళ్లకు ఏమైనా గుచ్చుకుంటాయని భయంతో సాధారణంగా చెప్పులు వేసుకుంటారు. ఇప్పుడంటే రకరకాల చెప్పులు వచ్చాయి కానీ.. పూర్వం అయితే ఎక్కడికైనా.. ఎంత దూరం అయినా చెప్పులు లేకుండానే నడిచేవారు.

Health: రోజూ ఉదయాన్నే చెప్పులు లేకుండా పావుగంట నడిస్తే చాలు..
Walking Barefoot
Follow us on

ప్రతిరోజూ ఉదయం కాసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అంటే చెప్పులు లేకుండా నేలపై నడవడం గుండె, మానసిక ఆరోగ్యం, కండరాలకు మేలు చేస్తుంది. చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అంటారు. దీని వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. దీనితో పాటు, ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

రోజూ ఉదయం 15 నుంచి 20 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రాంతం శుభ్రంగా, సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. పచ్చని పచ్చిక బయళ్ళు, పార్కులు, బీచ్‌లు వంటి ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవండి. ఇలా రోజూ చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థను కూల్ అయ్యి.. ఒత్తిడి తగ్గుతుంది.

మెరుగైన నిద్రను అందిస్తుంది:

నిద్రలేమితో బాధపడేవారికి చెప్పులు లేకుండా నడవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మంచి నిద్రను అందిస్తుంది. చెప్పులు లేకుండా నడవడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

కంటి స్పష్టత:

మీరు చెప్పులు లేకుండా నడిస్తే మీ పాదాలపై ఒత్తిడి పడుతుంది. ఇది మీ ఆప్టిక్ నరాలకి ఉత్తేజం చేస్తోంది. చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ఆ ప్రెజర్ పాయింట్‌ని ప్రేరేపించడం వల్ల మీ ఐ ఫోకస్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి:

చెప్పులు లేకుండా నడవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరాన్ని అనేక వ్యాధులతో పోరాడగలిగేలా చేస్తుంది.

వాపును తగ్గిస్తుంది:

వాపు శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సమస్యలు, ఇతర సమస్యలకు దారితీస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని ఎలక్ట్రాన్లు యాంటీఆక్సిడెంట్లుగా పని చేయడంలో సహాయపడతాయి. ఇది మీ శరీరంలో మంటను తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

చెప్పులు లేకుండా నడవడం మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం మీ మెదడుకు చాలా ఉత్తేజాన్నిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..