యాపిల్ పండులాగే కనిపించే పియర్స్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పియర్స్ పండ్ల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పియర్స్‌లో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, ఖోలైన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
మామూలుగా డయాబెటిక్స్ ఉన్న వారు అన్ని రకాల పండ్లూ తినకూడదు. కానీ… పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్‌తో అందరూ తినేందుకు వీలవుతోంది. పైగా ఇందులో శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. డయాబెటిక్స్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. హై బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌కి తీసుకురాలేకపోతే, అవి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రెగ్యులర్ ట్రీట్‌మెంట్, సరైన ఆహారం, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తుంటే, అధిక బరువు తగ్గడమే కాకుండా… షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల… మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి.. బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పద్ధతిగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్‌ను ఈ పండ్లు తగ్గిస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే టేస్ట్ బాగున్నాయి కదా అని పియర్స్ మరీ ఎక్కువగా తిన్నా ప్రమాదమే. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే… కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.