Lifestyle: నీరు తాగితే రక్తపోటు కంట్రోల్‌ అవుతుందా.? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Oct 26, 2024 | 11:22 AM

ఇటీవల రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీ పెరుగుతోంది. అయితే మంచి నీటిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: నీరు తాగితే రక్తపోటు కంట్రోల్‌ అవుతుందా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Bp
Follow us on

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో సరిపడ నీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరం హైడ్రేట్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతుంటారు. శరీరంలోని అన్ని భాగాలకు సరిపడ ఆక్సిజన్‌, రక్త సరఫరా సాగాలంటే నీటిని కచ్చితంగా సరిపడ తీసుకోవాలని అంటున్నారు.

శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిపడ నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కూడా మంచి నీరు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతీ రోజూ సరిపడ నీటిని తీసుకోవడం బీపీ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. భవిష్యత్తులో రక్తపోటు బారినపడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడ నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మనిషి గుండెలో సుమారు 73శాతం నీరు ఉంటుంది. అందుకే రక్తపోటు నియంత్రించడానికి నీరు బాగా ఉపయోగపడుతుంది. మంచి నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ బిపిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటితో పాటు అప్పుడప్పుడు నిమ్మరసం, దోసకాయ, హెర్బల్‌టీ, తక్కువ సోడియం సూప్, పాలు, పెరుగు వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు సమస్య బారిన పడకుండా ఉంటారు.

శరీరానికి సరిపడ నీరు లభించడం వల్ల శరీరంలోని రక్త నాళాలను సడలిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. నీరు రక్తాన్ని పలుచన చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో రక్తపోటు సమస్య దూరమవుతుంది. నీరు శరీరంలోని విష పదార్థాలను తొలగించి బీపీని అదుపులో ఉంచుతుంది. నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, తద్వారా రక్తపోటును నిర్వహిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉండాలంటే నీరుతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు వాకింగ్, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. వీటన్నింటితోపాటు.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, మెడిటేషన్‌ ద్వారా ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఉప్పును తగ్గించాలి. అదే విధంగా మద్యం, స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..