Walking: వాకింగ్ చేసేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? ఓసారి చెక్‌ చేసుకోండి..

|

Oct 26, 2024 | 11:01 AM

వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. అయితే వాకింగ్ చేసే సమయంలో చేసే కొన్ని తప్పులు లాభాలకు బదులుగా, నష్టాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాకింగ్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి తప్పులు చేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..

Walking: వాకింగ్ చేసేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? ఓసారి చెక్‌ చేసుకోండి..
Walking
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్‌ను కచ్చితంగా అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. క్రమంతప్పకుండా వాకింగ్‌ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ప్రతీరోజూ క్రమంతప్పకుండా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మొదలు, ఊబకాయం వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. అయితే వాకింగ్ చేసే సమయంలో మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇంతకీ ఏంటా తప్పులు.? వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాకింగ్ చేసే సమయంలో మనలో కొందరు శరీర భంగిమపై దృష్టిసారించరు. సరైన పొజిషన్‌లో నిలబడి నడవకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. శరీరం సరైన భంగిమలో లేకుండా నడుస్తుంటే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అలాగే వెన్నుపూసపై కూడా తీవ్ర భారం పడుతుందని అంటున్నారు. అందుకే వాకింగ్ చేసే సమయంలో నడుము నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ఇక మనలో చాలా మంది వాకింగ్ చేస్తున్న సమయంలో చేతులు ఊపే అలవాటు ఉంటుంది. దీనివల్ల పూర్తి స్థాయిలో లాభాలు జరగవు. శరీర సమతుల్యత కోల్పోతుంది. దీంతో మీరు వాకింగ్ చేసినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం దక్కదు. కాబట్టి వాకింగ్ చేసే సమయంలో చేతులు ఊపడకుండా వెళ్లాలి. వాకింగ్ లేదా జాబింగ్ చేసే సమయంలో చాలా మంది ధరించే పాద రక్షలపై పెద్దగా శ్రద్ధ చూపించరు. అయితే నాణ్యతలేని షూస్‌ను ధరిస్తే కాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇక వాకింగ్ చేస్తున్న సమయంలో కచ్చితంగా వెంట నీరు ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా వాకింగ్ చేసే సమయంలో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది అలసట, బలహీతకు దారి తీస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే కండరాల అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. వాకింగ్ చేసే సమయంలో తల కిందికి పెట్టుకోవడం కూడా మంచి అలవాటు కాదని నిపునులు చెబుతున్నారు. దీనివల్ల మెడ, భుజం నొప్పులు వస్తాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ వాకింగ్ చేసే తీవ్ర సమస్యలు తప్పవని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..