Green Tea: మీకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

|

Oct 31, 2024 | 6:25 PM

మనలో చాలా మందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రీన్ టీని అలవాటు చేసుకుంటున్నారు. అయితే గ్రీన్ తాగే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ గ్రీన్ టీ తాగే సమయంలో చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Green Tea: మీకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
Green Tea
Follow us on

ప్రస్తుతం గ్రీన్‌ టీ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతన్న తరుణంలో గ్రీన్‌ టీని అధికంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఈ అలవాటు ఎక్కువైంది. రోగనిరోధక శక్తి పెంచడం మొదలు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో గ్రీన్‌ టీ కీలక పాత్ర పోషిస్తుందని నినపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యోనికి ఎంతో మేలు చేసే గ్రీన్‌ టీని తీసుకునే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు. ఇంతకీ గ్రీన్‌ టీ తీసుకునే సమయంలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొందరు భోజనం చేసిన వెంటనే గ్రీన్‌ టీ తాగుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఐరన్ సంగ్రహణలో సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఐరన్‌ లోపానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం గంట తర్వాతే గ్రీన్‌ టీ తాగాలి.

* రోజుకు 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్‌ టీని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి గ్రీన్‌ టీ మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో.. అతిగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సంబంధ సమస్యలు రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

* కొన్ని రకాల మందులు వేసుకున్న వెంటనే కూడా గ్రీన్‌ టీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తాన్ని పల్చగా మార్చే మందులు, డిప్రెషన్, హై బీపీ వంటి సమస్యలతో బాధపడేవారు గ్రీన్‌ టీ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.

* మరీ ఉడుకుతున్న నీళ్లలో కూడా గ్రీన్‌ టీని కలుపుకొని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అందులోని పోషకాలు నశించిపోతాయి. అందుకే 80-85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటకుండా చూసుకోవాలి.

* గ్రీన్‌ టీలో కెఫీన్ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్రను డిస్బ్రబ్ చేస్తుంది. అందుకే పడుకునే ముందు గ్రీన్‌ టీని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పడుకునే 2 నుంచి 3 గంటల ముందే గ్రీన్‌ టీని తాగాలి.

* ఎసిడిటీ, అల్సర్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు గ్రీన్‌ టీకి దూరంగా ఉండడమే మంచిది. ఇందులోని ట్యానిన్ కారణంగా కడుపులో ఎసిడిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.