Hair Fall: వర్షా కాలంలో మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా.. ఇలా చేయండి..

|

Sep 01, 2024 | 6:27 PM

వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు శరీర పరంగా కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. సీజన్ మారినప్పుడు కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా.. ఇతర ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాయి. చాలా మంది ఎక్కుగా ఫేస్ చేసే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. ప్రస్తుతం చాలా మందికి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు బాగా రాలడంతో మహిళలందరూ ఎంతో కంగారు..

Hair Fall: వర్షా కాలంలో మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా.. ఇలా చేయండి..
Hair Fall
Follow us on

వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు శరీర పరంగా కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. సీజన్ మారినప్పుడు కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా.. ఇతర ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాయి. చాలా మంది ఎక్కుగా ఫేస్ చేసే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. ప్రస్తుతం చాలా మందికి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు బాగా రాలడంతో మహిళలందరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఒకింత ఆందోళనకు లోనవుతూ ఉంటారు. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి.. రోగాలతో ఎక్కువగా పోరాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే జుట్టుకు సరైన పోషణ అందదు. అలాగే వాతావరణంలోని తేమ కారణంగా కూడా జుట్టు రాలుతుంది. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఆహారాలు తీసుకోండి.

డ్రై ఫ్రూట్స్:

జుట్టు బాగా రాలిపోతూ ఉందంటే సరైన విధంగా పోషణ అందడం లేదని అర్థం చేసుకోండి. జుట్టు బలంగా ఉండాలంటే ఇతర పోషకాలతో పాటు జింక్ చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్‌లో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ కూడా మెండుగా లభ్యమవుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి.. జుట్టు త్వరగా రాలిపోకుండా చేస్తాయి.

క్యారెట్లు:

క్యారెట్లు తినడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది స్కాల్ఫ్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి

చిలకడ దుంపలు:

చిలకడ దుంపల్లో కూడా బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇవి కూడా జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. జుట్టును బలంగా, దృఢంగా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయ పడతాయి. ఇవి సీజన్‌ వారీగా లభిస్తాయి. కాబట్టి తప్పకుండా తీసుకోండి.

స్ట్రాబెర్రీలు:

స్ట్రాబెర్రీలు అందరికీ.. అన్ని సీజన్లలో కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ తీసుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు తింటూ ఉండండి. ఇవి జుట్టును బలంగా ఉంచేందుకు సహయ పడతాయి. తరచూ స్ట్రాబెర్రీలు తింటూ ఉంటే జుట్టు రాలడమే ఆగిపోతుంది.

పప్పులు:

జుట్టు రాలే సమస్య ఉన్నవారు తమ డైట్‌లో పప్పులు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో జింక్, ఐరన్, ప్రోటీన్, బయోటిన్ వంటివి లభ్యమవుతాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..