Lifestyle: మంచి ఆలోచనలు రావాలా.? అయితే రోజూ ఇలా చేయండి..

|

Oct 18, 2024 | 1:27 PM

ప్రస్తుతం మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, జీవనశైలి కారణంగా ఈ సమస్య బారినపడుతున్నారు. దీంతో నెగిటివ్ ఆలోచనలతో సతమతమవుతున్నారు. అయితే మనస్సులో వచ్చే నెగిటివ్ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: మంచి ఆలోచనలు రావాలా.? అయితే రోజూ ఇలా చేయండి..
Lifestyle
Follow us on

శారీకంగా ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో మానసికంగాను కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం నెగిటివ్‌ ఆలోచనలతో సతమతమవుతున్నారు. అయితే చాలా మంది అసలు దీనిని ఒక సమస్యగా కూడా భావించడం లేదు. తమలో తామే బాధను అనుభవిస్తుంటారు.

నిజానికి మానసిక సమస్యలను దూరం చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక నిపుణులను సంప్రదిస్తే ఇందుకు సంబంధించిన చికిత్స సైతం అందిస్తుంటారు. అయితే ఇవేవి లేకుండా కూడా నెగిటివ్‌ ఆలోచనలను తరిమికొట్టి మంచి ఆలోచనలు వచ్చేలా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వాకింగ్, జాగింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్​ గా వ్యాయామం చేయడం వల్ల ఆలోచన శకి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పలువురిపై అధ్యయనాలు చేసి మరీ పరిశోధకులు తెలిపారు.

నిత్యం వ్యాయామం చేసే వాళ్లు చురుగ్గా ఉండడమే కాకుండా.. ఆలోచన తీరు బాగుందని తేలింది. వ్యాయామం చేయనివాళ్లలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని పరిశోధల్లో వెల్లడైంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే వారిలో మతిమరుపు తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టవు. మెదడు పనితీరు బాగుంటుందని నిపుణులు అంటున్నారు.

దీంతో నెగిటివ్‌ ఆలోచనలు కూడా దూరమవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా, యోగా.. మెడిటేషన్‌ వంటి వాటితో కూడా ఆలోచనా శక్తి పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. నిత్యం నెగిటివ్‌ ఆలోచనలతో ఇబ్బంది పడేవారు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్‌ చేస్తే అలాంటి ఆలోచనలన్నీ దూరమై మనస్సు ప్రశంతంగా ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..