Watermelon & Kidney Health: పుచ్చకాయలు ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలు వస్తాయా?

వేసవిలో పుచ్చకాయలు తినడానికి అందరూ ఇష్టపడతారు. నీటి శాతం అధికంగా ఉంటే పుచ్చ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా పోషకాలనూ అందిస్తుంది. అయితే పుచ్చకాయలు అధికంగా తీసుకుంటూ కిడ్నీ సమస్యలు వస్తాయని కొందరు భావిస్తారు. ఇందులో నిజం ఎంత ఉందో నిపుణుల మాటల్లో మీ కోసం..

Watermelon & Kidney Health: పుచ్చకాయలు ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలు వస్తాయా?
Watermelon For Kidney Health

Updated on: May 01, 2026 | 12:52 PM

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఈ విధంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. శరీరంలో నీటి కొరతను నివారించడానికి వేసవిలో జనాలు వీటిని ఎక్కువగా తింటుంటారు. కానీ పుచ్చకాయ మూత్రపిండాల ఆరోగ్యానికి హానికరమని కొందరు భావిస్తారు. ఇందులో నిజమెంతో? పుచ్చకాయ మూత్ర పిండాలను ఎలా ప్రభావితం చేస్తుందో? మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనిని తింటే ఏమవుతుందో? ఇక్కడ తెలుసుకుందాం..

పుచ్చకాయ తినడం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిదేనా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయను మితంగా తినడం మూత్రపిండాలకు హానికరం కాదు. ఇందులో దాదాపు 90% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి హైడ్రేషన్ మూత్రపిండాల పనితీరుకు మంచిది. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ సి, పొటాషియం, కొంత మొత్తంలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి.

మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పుచ్చకాయలు తీసుకోవచ్చా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు సాధారణంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే పుచ్చకాయలను మితంగా తీసుకోవాలి. అందులో ఉండే అమైనో ఆమ్లాలు మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వైద్యుల మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా పాటించాలి.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ మూత్రపిండాలను శుభ్రపరుస్తుందా?

పుచ్చకాయ మూత్రపిండాలను శుద్ధి చేస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వైద్యపరంగా శరీరం నుంచి విష పదార్థాలను తొలగించే సామర్థ్యం మూత్రపిండాలకే ఉంది. పుచ్చకాయ శరీరానికి తేమను అందిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, దీనిని అధికంగా తీసుకోవడం శరీరంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయంలో మధుమేహ రోగులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us