Protein Food: ప్రస్తుతం అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ సాంకేతిక వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుమతి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సైన్స్‌తో వస్తోన్న మార్పులు పోషకాహార లోపాన్ని జయించవచ్చు అన్న చర్చ జరుగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సాంకేతిక వినియోగంతో పెద్ద ఎత్తున ఉన్న జనాభాకు పోషకాహారంతో కూడిన ఆహారం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయమై ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన ఫుడ్ టెక్నాలజీ ప్రొఫెసర్ హరి నివాస్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మన దృష్టి ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దాని కంటే, ఆహార నాణ్యతను మెరుగుపరచడంపై ఉండాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్న మన పరిశోధనలు, శక్తి సామర్థ్యాలు ఉహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే స్థాయికి చేరుకున్నాయి. అంతకు ముందు మన పరిశోధనల విభాగం ఆహార ఉత్పత్తిని ఎలా పెంచాలన్న దానిపైనే దృష్టి సారించింది. కానీ నేడు స్వయం సమృద్ధికి చేరుకున్న తర్వాత ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన ఆహార నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నాము. పోషకాహార నాణ్యతను మెరుగుపరచడం అంటే సగటు భారతీయుడు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు వంటి వాటిని పెంచడం. ప్రాసెస్ ఫుడ్, జన్యుపరంగా మార్పు చేసిన ఆహారం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని సృష్టించవచ్చు. అయితే దానిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలి’ అని చెప్పుకొచ్చారు.
ఇక పోహకాహార విషయంలో సోయాబీన్ కీలక పాత్ర పోషిస్తుందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వీసీ, జెనెటిక్స్ నిపుణుడు ప్రొఫెసర్ దీపక్ పెంటల్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘సోయాబీన్ మనుషులతో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోటీన్ ఆహారాన్ని అందించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మధ్య, ఉన్నత తరగతి వారు ప్రాసెస్ ఫుడ్‌ను తీసుకుంటున్నారు. కానీ సమాజంలో పౌష్టికాహారం అవసరయ్యే వారికి మాత్రం ఏం చేయలేకపోతున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రాసెస్ సోయాబీన్‌ను ఉపయోగించుకోలేకపోతున్నాం’ అని చెప్పుకొచ్చారు. సోయాబీన్ ఉత్పత్తి గురించి మాట్లాడుతూ..’ప్రస్తుతం మధ్య భారతదేశంలో 10-11 మిలియన్ హెక్టార్లలో సోయాబీన్ విస్తృతంగా పండిస్తున్నారు. కానీ ఉత్పత్తి హెక్టారుకు కేవలం టన్ను మాత్రమే ఉంటుంది. ఉప్పత్తిని హెక్టారుకు రెండు టన్నులకు పెంచడం శాస్త్రవేత్తలకు ఛాలెంజింగ్‌గా మారింది. పోషకాహార భద్రతే కాకుండా ఫుడ్ సైన్స్ ద్వారా పంట దిగుమతి కూడా పెరుగుతుంద’ని ప్రొఫెసర్ దీపక్ పెంటల్ చెప్పుకొచ్చారు.
ఫుడ్ సైన్స్ వినియోగం పెరగడం ద్వారా ఆహార వృథాను కూడా తగ్గించవచ్చని ప్రొఫెసర్ హరి నివాస్ మిశ్రా అభిప్రాయపడ్డారు. సరైన నిల్వ పద్ధతులు ఉపయోగించకోపవడం ద్వారా ఆహార ఉత్పత్తులతో పాటు, కూరగాయలు పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా ఆహార వృథాను తగ్గించవచ్చని ఆయన సూచించారు. ఈనాటికీ 15 నుంచి 20 శాతం ఆహార ఉత్పత్తులు పాడవుతున్నాయని, ఈ మొత్తాన్ని తగ్గించేందుకు మనం సాంకేతిక వినియోగం దృష్టిసారించాలని మిశ్రా సూచించారు.
భారత దేశం పాల ఉత్పత్తులను ప్రాసెస్ చేసినంత విజయవంతంగా ఇతర ఆహార పదార్థాలను చేయడంలో విఫలమైందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (NIFTEM) ప్రొఫెసర్ అశుతోష్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ‘మన పొరుగు దేశాల్లో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలతో పోలిస్తే భారత్‌లో జరిగే ఫుడ్ ప్రాసెసింగ్ 4 నుంచి 5 శాతం ఎక్కువ. శ్వేత విప్లవం తర్వాత పాల ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌కు సంబంధించి మంచి వ్యవస్థ ఏర్పడింది. వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించడానికి పాశ్చరైజేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయల విషయంలోనూ ఇలాంటి ఒక వ్యవస్థీకృత ప్రాసెసింగ్ జరిగితే ఆహార భద్రత సాధ్యమవుతుంద’ని అశుతోష్ చెప్పుకొచ్చారు.
మారుతోన్న జీవనశైలి కారణంగా రానున్న రోజుల్లో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని జనం పెద్ద ఎత్తున ఆమోదించే అవకాశాలున్నాయని అశుతోష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు చొరువు తీసుకుంటుండడంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది. జన్యుపరంగా మార్పులు చేసిన ఆహారాన్ని అంగీకరించాలనే ప్రశ్నపై ప్రొఫెసర్ స్పందిస్తూ.. ప్రపంచంలోని ఇతర దేశాల్లోగే ఈ విషయమై భారత్‌కు కూడా అందరికీ ఆమోద్యయేగమైన ఒక ఫ్రేమ్ వర్క్‌ను తీసుకురావాలని సూచించారు. ఇది పోషకాహార భద్రతకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నేడు సార్టప్ సంస్కృతి కీలక పాత్ర పోషిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్, పోషకాహారాన్ని పెంచడంలో అవసరమయ్యే సాంకేతిక, మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో స్టార్టప్స్ సహాయపడతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు అశుతోష్ ఉపాధ్యాయ తెలిపారు.