Beauty Tips: కాబోయే పెళ్లి కూతుళ్లు పెళ్లిలో మరింత అందంగా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి.. వారం ముందు నుంచే ఇవి తింటే సరి..

|

Nov 27, 2022 | 8:55 PM

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు పెళ్లి విషయంలో ఎన్నో ఆశలతో ఉంటారు. కలల రాకుమారుడిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇక జీవితంలో ఒకేసారి చేసుకోవాలనుకునే పెళ్లిని అంగరంగవైభవంగా చేసుకోవాలనుకుంటారు...

Beauty Tips: కాబోయే పెళ్లి కూతుళ్లు పెళ్లిలో మరింత అందంగా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి.. వారం ముందు నుంచే ఇవి తింటే సరి..
Representative Image
Follow us on

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు పెళ్లి విషయంలో ఎన్నో ఆశలతో ఉంటారు. కలల రాకుమారుడిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇక జీవితంలో ఒకేసారి చేసుకోవాలనుకునే పెళ్లిని అంగరంగవైభవంగా చేసుకోవాలనుకుంటారు. అందులో భాగంగానే వివాహ వేడుకల్లో అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకుగాను బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే తీసుకునే ఆహారం ద్వారా సహజంగా అందం సొంతం చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? కాబోయే పెళ్లి కూతుళ్లు.. వారం రోజుల ముందు మీ డైట్‌లో ఈ ఫుడ్‌ను చేర్చుకుంటే అందంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటంటే..

* డార్క్ చాక్లెట్ ఒత్తిడిని చిత్తు చేస్తుందనే విషయం తెలిసిందే. అంతేకాకుండా మీ చర్మంలో స్కిన్ కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా చర్మాన్ని మెరిసేలా, యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే జింక్, ఐరన్ రక్త ప్రసరణను పెంచుతుంది.

* పెళ్లిలో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చర్మ సమస్యలకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ముఖం ఉండే మచ్చలను తగ్గించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు కూడా పనిచేస్తుంది. ఇందుకోసం పచ్చి పసుపును పాలలో మరిగించి తాగాలి.

ఇవి కూడా చదవండి

* మెరిసే చర్మానికి బాదం సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ చర్మానికి చాలా అవసరం. బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. అంతే కాదు బాదం మీ జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

* చర్మానికి మెరుపు తీసుకురావడంలో ఓట్ మీల్ ఉత్తమంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఓట్ మీల్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..