Boiled vs Raw Papaya: పచ్చి బొప్పాయి సుగుణాలు.. ఇలా తీసుకుంటే ఎన్నో సమస్యలకు ఔషదం దొరికినట్లే!

బొప్పాయి అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇది అన్ని కాలాల్లోనూ సులభంగా లభిస్తుంది. పచ్చి బొప్పాయితో చట్నీ, సలాడ్‌గా, రుచికరమైన వంటల్లోనూ ఉపయోగిస్తారు. అయితే పండిన బొప్పాయిని తీపి రుచి కలిగి ఉంటుంది. పండిన బొప్పాయిలో, పచ్చి బొప్పాయిలో రుచితో పాటు ఇందులో ఉండే పోషకాల స్థాయి కూడా భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది..

Boiled vs Raw Papaya: పచ్చి బొప్పాయి సుగుణాలు.. ఇలా తీసుకుంటే ఎన్నో సమస్యలకు ఔషదం దొరికినట్లే!
Raw Papaya

Updated on: Mar 21, 2026 | 9:11 PM

పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేసే పండు. ఇది పూర్తిగా పండకపోయినా ఇందులో అనేక పోషకాలు దండిగా ఉంటాయి. పచ్చి బొప్పాయికి ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక శారీరక సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. అన్నింటికంటే ముందు పచ్చి బొప్పాయి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం జీర్ణం కానప్పుడు, కడుపు భారంగా అనిపించినప్పుడు పచ్చి బొప్పాయి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి పచ్చి బొప్పాయి సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా, పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించి ఇంకా తినాలనే కోరికను తగ్గిస్తుంది. అందువల్ల బరువును నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే పచ్చి బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్లు సి, ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఉంటుంది.

పచ్చి బొప్పాయి చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు చర్మాన్ని పోషించి, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. కొందరు పచ్చి బొప్పాయిని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది కాకుండా పచ్చి బొప్పాయి పీరియడ్స్ సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేసి, నెలసరిని క్రమబద్ధం చేయడంలో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల పచ్చి బొప్పాయి కేవలం ఒక సాధారణ పండు మాత్రమే కాదు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని సరైన పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, చర్మం, బరువు తగ్గించడం వంటి మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది.

పొటాషియం

పచ్చి బొప్పాయిలోని పోషకాల విషయానికి వస్తే పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది. నిజానికి బొప్పాయి మొక్క వేర్ల అభివృద్ధికి పొటాషియం చాలా ముఖ్యం. అందుకే పచ్చి కాయలలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే, పండే ప్రక్రియలో పొటాషియం స్థాయి మారుతుంది. కానీ పండిన పండు ఇతర విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ

పచ్చి బొప్పాయి జీర్ణ వ్యవస్థకు సర్వరోగ నివారిణి లాంటిది. దీనిలో ‘పాపైన్’ అనే ప్రోటీన్ ఎంజైమ్ జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అయితే పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో పాపైన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తీవ్రమైన మలబద్ధకం, కడుపు సమస్యలకు సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తుంది.

అయితే, హెల్త్‌లైన్ ప్రకారం పచ్చి బొప్పాయిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం. పచ్చి బొప్పాయిలో అధిక మొత్తంలో లేటెక్స్ ద్రవం ఉంటుంది. ఇది కొంతమందిలో చర్మ అలెర్జీలు లేదా దురదకు కారణం కావచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భిణీలు పచ్చి బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే అందులో ఉండే లేటెక్స్ గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పచ్చి బొప్పాయిలో మహిళల ఆరోగ్యానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసవానంతరం పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి మహిళలు పచ్చి బొప్పాయిని తింటారు. ఈ కూరగాయను తినడం వల్ల కొత్త తల్లిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే, ఇది కాలేయాన్ని బలపరుస్తుంది మరియు కామెర్ల వంటి వ్యాధుల నుండి కాలేయం కోలుకోవడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us