బాడీ పాలిషింగ్ అంటే ఏమిటి? స్కిన్‌కు తేమని అందాన్ని ఇచ్చే దీనిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?

|

Jul 16, 2024 | 12:19 PM

ముఖంలాగే చర్మంలో పేరుకుపోయిన మృతకణాలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఇందు కోసం బాడీ స్క్రబ్ లేదా మాయిశ్చరైజేషన్ ను ఆశ్రయించవచ్చు. లేదా బాడీ పాలిషింగ్ కూడా ప్రయత్నించవచ్చు. ఈ బాడీ పాలిషింగ్ ను పార్లర్‌లో మాత్రమే కాదు ఇంట్లోనే ప్రయత్నించ వచ్చు. బాడీ పాలిషింగ్ అనేది కొందరికి కొత్తగా అనిపించవచ్చు. అయితే పురాతన కాలంలో కూడా ప్రజలు తమ శరీర చర్మాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. బాడీ పాలిషింగ్ అంటే ఏమిటో, చర్మ సంరక్షణలో బాడీ పాలిషింగ్ వలన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

బాడీ పాలిషింగ్ అంటే ఏమిటి? స్కిన్‌కు తేమని అందాన్ని ఇచ్చే దీనిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
Body Polishing At Home
Follow us on

ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి స్త్రీలే కాదు పురుషులు కూడా ఎన్నో ప్రత్యేకమైన లేదా సరికొత్త పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. ముఖం మన వ్యక్తిత్వానికి అద్దం వంటిదని చెబుతారు. అయితే ముఖాన్ని మాత్రమే కాదు చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు తమ చర్మ సంరక్షణను విస్మరిస్తారు. దీని కారణంగా వారి చర్మం వయసుకంటే ముందే ముదుసలి రూపంలో కనిపిస్తుంది. కనుక ముఖంలాగే చర్మంలో పేరుకుపోయిన మృతకణాలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఇందు కోసం బాడీ స్క్రబ్ లేదా మాయిశ్చరైజేషన్ ను ఆశ్రయించవచ్చు. లేదా బాడీ పాలిషింగ్ కూడా ప్రయత్నించవచ్చు. ఈ బాడీ పాలిషింగ్ ను పార్లర్‌లో మాత్రమే కాదు ఇంట్లోనే ప్రయత్నించ వచ్చు.

బాడీ పాలిషింగ్ అనేది కొందరికి కొత్తగా అనిపించవచ్చు. అయితే పురాతన కాలంలో కూడా ప్రజలు తమ శరీర చర్మాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. బాడీ పాలిషింగ్ అంటే ఏమిటో, చర్మ సంరక్షణలో బాడీ పాలిషింగ్ వలన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

బాడీ పాలిషింగ్ అంటే ఏమిటంటే?

శరీరమంతా మసాజ్ చేసే బ్యూటీ ట్రీట్‌మెంట్ ను బాడీ పాలిషింగ్ అని అంటారు. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు ఆరోగ్యంగా, దీర్ఘకాలం మెరుస్తూ ఉండేలా చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రక్రియ మన చర్మంలో ఉన్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. ఎందుకంటే బాడీ పాలిషింగ్ ద్వారా చర్మంలో లోతైన శుభ్రత సాధ్యమవుతుంది. బాడీ పాలిషింగ్ వలన చర్మం తేమగా మారుతుంది. మొత్తం శరీరం క్రీమ్ లేదా స్క్రబ్ ద్వారా శుభ్రం చేయబడుతుంది. ఇందులో కొబ్బరి నూనె, కాఫీ, చక్కెర పొడి లేదా ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. అయితే ఇలా బాడీ పాలిషింగ్ చేసుకోవాలంటే వేరొకరి సహాయం కావాలి. అయితే మీరు దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

బాడీ పాలిషింగ్ వలన కలిగే ప్రయోజనాలు

మృతకణాలను తొలగిస్తాయి: ముఖానికి స్క్రబ్బింగ్ లేదా మసాజ్ చేయడం ద్వారా మృతకణాలు తొలగిపోతాయి. అదేవిధంగా బాడీ పాలిషింగ్ ద్వారా చర్మంలోని మృతకణాలను తొలగించవచ్చు. ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ ఇందులో ఉపయోగించబడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో ఉత్తమమైన ప్రక్రియ.

స్కిన్ మెరుపు: ఈ ప్రత్యేకమైన చర్మ సంరక్షణ ట్రిక్ ద్వారా చర్మం మెరుస్తుంది. స్క్రబ్బింగ్ పద్ధతి చర్మానికి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మురికి తొలగిన వెంటనే చర్మం ఛాయ మెరుగుపడుతుంది.

అలసట పోతుంది: బాడీ పాలిషింగ్ ద్వారా బాడీ మసాజ్ కూడా జరుగుతుంది. దీని ద్వారా అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. వారానికి ఒకసారి బాడీ పాలిష్ చేయించుకోవడం వలన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

ఇంట్లో శరీరానికి బాడీ పాలిషింగ్ ఎలా చేసుకోవాలంటే

  1. బాడీ పాలిషింగ్ చేసుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
  2. ఇప్పుడు స్క్రబ్‌ని శరీరం మొత్తానికి అప్లై చేసి ఆరనివ్వాలి. కాసేపు నీటి సహాయంతో శరీరం మొత్తాన్ని స్క్రబ్ చేయాలి
  3. ఇప్పుడు శుభ్రమైన నీటితో శరీరాన్ని శుభ్రం చేసి.. చర్మంపై ఏదైనా ప్యాక్ వేయండి.
  4. ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు నూనెతో శరీరానికి మసాజ్ చేసుకుని అనంతరం స్నానం చేయండి.

బాడీ పాలిషింగ్ కోసం ఇంటి చిట్కాలు

బియ్యప్పిండి: బియ్యప్పిండిని స్క్రబ్ చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. పుదీనా రసాన్ని బియ్యం పిండిలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు చర్మ సంరక్షణలో సహాయపడతాయి.

కాఫీ పొడి, తేనె: చర్మాన్ని మెరిసేలా లేదా శుభ్రంగా ఉండేలా చేసుకోవాలనుకుంటే కాఫీ పౌడర్, తేనె రెమెడీని ప్రయత్నించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో తేనె తీసుకుని అందులో రెండు చెంచాల కాఫీపొడి కలపాలి. బాగా కలిపిన తర్వాత శరీరానికి పట్టించి ఆరనివ్వాలి. ఇప్పుడు చేతిలో కొంచెం తేనె తీసుకొని 3 నుండి 4 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి లేదా మసాజ్ చేయండి. నడుము మసాజ్ కోసం మరొకరి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

కొబ్బరి నూనె: బాడీ ఆయిల్ మసాజ్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. తేమగా ఉండేలా చేస్తుంది. ఇంకా కావాలనుకుంటే కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను జోడించవచ్చు. చివరగా సాధారణ నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ రకమైన విత్తనాలనైనా ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)