రామ్మోహన్.. లోకేష్‌కు సమఉజ్జీ.. డౌటే లేదు..

ఏపీ ఈఎస్ఐ స్కాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

  • Ravi Kiran
  • Publish Date - 3:25 pm, Fri, 12 June 20
రామ్మోహన్.. లోకేష్‌కు సమఉజ్జీ.. డౌటే లేదు..

ఏపీ ఈఎస్ఐ స్కాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తుందంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘తక్కువ మాట్లాడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది. అజ్ఞానం బయట పడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్ పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకి సమఉజ్జీనే. డౌటే లేదు. ఆ పార్టీకి కావాల్సింది ఇలాంటి వారే’. అంటూ ట్వీట్ చేశారు.