వివేక హత్యకేసులో సిట్ ఎదుట హాజరైన బీజేపీ నేత

మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. గతకొద్ది రోజులుగా కడప డీటీసీలో దాదాపు 160 మందిని సిట్ విచారించి.. వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. తాజాగా ఇవాళ మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈయనతో పాటుగా..వివేక వ్యక్తిగత సహాయకుడు […]

వివేక హత్యకేసులో సిట్ ఎదుట హాజరైన బీజేపీ నేత
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 2:39 PM

మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. గతకొద్ది రోజులుగా కడప డీటీసీలో దాదాపు 160 మందిని సిట్ విచారించి.. వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. తాజాగా ఇవాళ మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈయనతో పాటుగా..వివేక వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.

కాగా, తనకు ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బుధవారం మీడియా సమవేశంలో స్పష్టం చేశారు. అంతేకాదు.. సంబంధం ఉందని తేలితే.. బహిరంగ ఉరికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డిని సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి.. వివేకా హత్య జరిగినప్పటి వరకు.. వివిధ పరిణామాలపై ఆదిని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles