Chating Apps: వాట్సప్ vs సిగ్నల్ vs టెలిగ్రామ్.. ఏది సేఫ్?.. ఏది బెటర్?.. ఇలా తెలుసుకోండి..

|

Jan 16, 2021 | 7:04 PM

Chating Apps: వాట్సప్ ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ఫిబ్రవరి 8లోగా కొత్త నిబంధనలను అంగీకరించకపోతే సంబంధిత..

Chating Apps: వాట్సప్ vs సిగ్నల్ vs టెలిగ్రామ్.. ఏది సేఫ్?.. ఏది బెటర్?.. ఇలా తెలుసుకోండి..
Follow us on

Chating Apps: వాట్సప్ ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ఫిబ్రవరి 8లోగా కొత్త నిబంధనలను అంగీకరించకపోతే సంబంధిత వినియోగదారుల అకౌంట్లను డిలిట్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. వాట్సప్ యాజమాన్యం ప్రైవసీ పాలసీ యూజర్ల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ సలహాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో చాలా మంది వాట్సప్ యూజర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఏ యాప్ అయితే బెటర్ అనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వాట్సప్‌కు గుడ్ బై చెబుతూ సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వాట్సప్ వర్సెస్ సిగ్నల్ వర్సెస్ టెలిగ్రామ్ ‌అన్న పరిస్థితి ఏర్పడింది. అయితే, తీవ్ర గందరగోళం నేపథ్యంలో వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌లలో ఏది బెటర్..? ఏది సురక్షితం..? ఏది సులువుగా ఉంటుది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాంకేతిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం..

వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ ఫీచర్స్ మధ్య తేడా..
వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్ ‌యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్‌కు వెబ్ వర్షన్‌లు ఉన్నాయి. వీటిని కంప్యూటర్‌లలోనూ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే సిగ్నల్ వెబ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సిగ్నల్, వాట్సప్‌లు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోనూ పని చేస్తాయి. టెలిగ్రామ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయదు.
వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ అప్లికేషన్లు డెస్క్ టాప్ వెర్షన్‌కు కాంటాక్ట్‌లు, మెసేజ్ సింక్రనైజేషన్ చేయడాన్ని సపోర్ట్ చేస్తాయి.
టెలిగ్రామ్, సిగ్నల్ వినియోగదారులు కంప్యూటర్, ల్యాప్ టాప్ నుంచి కూడా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సప్ వినియోగదారులకు ఆ అవకాశం లేదు.
వాట్సప్, సిగ్నల్ యాప్‌లను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో వాడుకోవాలంటే ఫోన్‌లో వాటి యాప్‌లను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ యాప్ మాత్రం ఎలాగైనా యూజ్ చేయవచ్చు. సైన్ ఇన్, సైన్ అప్ అయితే చాలు.

యూజర్ల సెక్యూరిటీ విషయంలో..
సిగ్నల్ యాప్..


సిగ్నిల్ యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌ ఉంది. సిగ్నిల్ ద్వారా పంపించిన సందేశాలు రహస్యంగా ఉంచబడుతాయి. ప్రైవేట్ సందేశాలను, మీడియాను సిగ్నల్ సర్వర్‌లో నిల్వచేయదు. సిగ్నల్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సందేశాలు పంపబడే వరకు వాటిని సర్వర్‌లో నిల్వ చేస్తుంది. సిగ్నల్ రిజిష్ట్రేషన్ లాక్ కోసం పిన్ సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రైవేటు ప్రొఫైల్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఒక వినియోగదారుడు తన ఫోన్‌ను కోల్పోయినా.. కొత్తది కొని అందులో సిగ్నల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినా.. ప్రొఫైల్, సెట్టింగులు, కాంటాక్ట్‌లు తిరిగి పొందడానికి ఈ లాక్‌ పిన్ ఉపయోగపడుతుంది.

వాట్సప్..


సిగ్నల్ వాడే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్‌ను వాట్సప్‌ కూడా ఉపయోగిస్తుంది. ఇది ఐపీ అడ్రస్, గ్రూప్ వివరాలు, స్టేటస్ వంటి ఇతర ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. వాట్సప్‌ క్లౌడ్‌లో నిల్వ చేసిన సందేశాలను ఎన్క్రిప్షన్ చేయదు. దాంతో వినియోగదారుల సమాచారానికి భద్రత కచ్చితంగా చెప్పలేం.

టెలిగ్రామ్..


ఇది ఓపెన్స్ సోర్స్ కాదు. సర్వర్లు వీటి కీలను ఆపరేట్ చేస్తాయి. ఇన్‌బిల్డ్ క్లౌడ్ బ్యాకప్ ఉంది. దీనిలో సీక్రెట్ చాటింగ్ బ్యాకప్ ఉండదు. రహస్య చాటింగ్‌లకు స్క్రీన్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రకటనల కోసం యూజర్లకు సంబంధించి ఎలాంటి డేటాను ఉపయోగించరు. ఈ యాప్ యూజర్ యొక్క కాంటాక్ట్ నంబర్ మరియు యూజర్ ఐడీని నిల్వ చేస్తుంది.

సంక్షిప్తంగా ఏ యాప్ తీరు ఎలా ఉందంటే..
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విషయానికి వస్తే..
సిగ్నల్: ఇది ఓపెన్ సోర్స్. పూర్తిగా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది.
టెలిగ్రామ్: ఇది ఓపెన్స్ సోర్స్ కాదు. సర్వర్లు వీటి కీలను ఆపరేట్ చేస్తాయి.
వాట్సప్: ఇది ఓపెన్ సోర్స్ కాదు. బ్యాకప్‌లను గుర్తించబడవు.

చాట్ బ్యాకప్స్‌ను పరిశీలిస్తే..
సిగ్నల్: లోకల్ బ్యాకప్‌లను ఆన్ చేసుకోవచ్చు. ఇది డీఫాల్ట్‌ ఆఫ్ చేసి ఉంటాయి.
టెలిగ్రామ్: ఇన్‌బిల్డ్ క్లౌడ్ బ్యాకప్ ఉంది. దీనిలో సీక్రెట్ చాటింగ్ బ్యాకప్ ఉండదు.
వాట్సప్: థర్డ్ పార్టీ క్లౌడ్ బ్యాకప్ సదుపాయం ఉంది. చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు.

స్క్రీన్ భద్రత..
టెలిగ్రామ్: రహస్య చాటింగ్‌లకు స్క్రీన్ సెక్యూరిటీ ఉంటుంది.
వాట్సప్: పూర్తిగా ఓపెన్ సోర్స్ కాదు.
సిగ్నల్: రహస్య చాటింగ్‌లకు స్క్రీన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ కాదు.

ప్రకటనా విధానం..
టెలిగ్రామ్: ప్రకటనల కోసం యూజర్లకు సంబంధించి ఎలాంటి డేటాను ఉపయోగించరు.
వాట్సప్: ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌తో అందుబాటులో ఉన్న డేటాను పంచుకోవచ్చు.
సిగ్నల్: ప్రకటన కోసం యూజర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని తీసుకోదు.

Also read:

రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు తీవ్ర అస్వస్ధత, జైలు నుంచి తరలింపు, ముంబై జేజే ఆసుపత్రిలో చేరిక,

Narendra Modi: మోదీకి తెలుగంటే మక్కువా? గురజాడ పంక్తులనెందుకు కోట్ చేశారు? తెలుగుతో నరేంద్రుని అనుబంధం