కథువా హత్యాచారం కేసు: నేడే తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసు విచారణ ముగిసింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టులో నిందితుల తరఫు న్యాయవాదులు తమ వాదనలను గతవారం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పటాన్‌కోఠ్‌లోని స్పెషల్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. అయితే గత ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి.. 4 రోజులపాటు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం […]

కథువా హత్యాచారం కేసు: నేడే తీర్పు
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 10:01 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసు విచారణ ముగిసింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టులో నిందితుల తరఫు న్యాయవాదులు తమ వాదనలను గతవారం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పటాన్‌కోఠ్‌లోని స్పెషల్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. అయితే గత ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి.. 4 రోజులపాటు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. కాగా ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు ఉండగా.. వారిలో ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. వీరు దోషులుగా తేలితే  యావజ్జీవం గానీ, ఉరి శిక్ష గానీ విధించే అవకాశం ఉంది.