Vastu Tips: రాత్రి సమయంలో చెట్లు, మొక్కల నుంచి ఆకులు, పువ్వులను తెంపరాదు.. రీజన్ ఏమిటంటే

హిందూ మతంలో చెట్లు , మొక్కలను కూడా మానవులు, జంతువుల వలె జీవులుగా పరిగణించబడతాయి. అన్ని ఇతర జీవుల వలె, చెట్లు , మొక్కలు కూడా ఉదయం నిద్రలేచి సాయంత్రం విశ్రాంతి తీసుకుంటాయని కూడా నమ్మకం. నిద్రలో ఉన్న వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండా లేపడం సరికాదని, పాపమని భావించినట్లే.. సాయంత్రం తర్వాత చెట్లు.. మొక్కలు కూడా నిద్రపోతాయని నమ్ముతారు. అందుకే వాటిని తాకడం లేదా సాయంత్రం తర్వాత వాటి పువ్వులు, ఆకులు తీయడం వలన అవి ఇబ్బంది పడతాయట.

Vastu Tips: రాత్రి సమయంలో చెట్లు, మొక్కల నుంచి ఆకులు, పువ్వులను తెంపరాదు.. రీజన్ ఏమిటంటే
Vastu Tips
Follow us

|

Updated on: Apr 19, 2024 | 9:30 PM

హిందూ మతం, వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. హిందూ మతం, వాస్తు శాస్త్రం రెండింటి ప్రకారం కొన్ని సందర్భాల్లో చెట్లు, మొక్కల ఆకులు తెంపడం, పువ్వులను కోయడం కనీసం తాకడం కూడా నిషేధం. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయం లేదా రాత్రి వాటిని తాకడం నిషేధించబడింది. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. నేటికీ చాలా మంది దీనిని అనుసరిస్తారు. ఈ నమ్మకం వెనుక కొన్ని మతపరమైన కారణాలు ఉన్నాయి. రాత్రిపూట చెట్లను, మొక్కలను తాకకూడదని లేదా వాటి పువ్వులు లేదా ఆకులను కట్ చేయరాదని సైన్స్ నమ్ముతుంది. దీని వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

మతపరమైన కారణాలను తెలుసుకోండి

హిందూ మతంలో చెట్లు , మొక్కలను కూడా మానవులు, జంతువుల వలె జీవులుగా పరిగణించబడతాయి. అన్ని ఇతర జీవుల వలె, చెట్లు , మొక్కలు కూడా ఉదయం నిద్రలేచి సాయంత్రం విశ్రాంతి తీసుకుంటాయని కూడా నమ్మకం. నిద్రలో ఉన్న వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండా లేపడం సరికాదని, పాపమని భావించినట్లే.. సాయంత్రం తర్వాత చెట్లు.. మొక్కలు కూడా నిద్రపోతాయని నమ్ముతారు. అందుకే వాటిని తాకడం లేదా సాయంత్రం తర్వాత వాటి పువ్వులు, ఆకులు తీయడం వలన అవి ఇబ్బంది పడతాయట. ఈ కారణంగా రాత్రి సమయంలో చెట్లను, మొక్కలను తాకడం లేదా తెంపడం పాపమని నమ్మకం.

అనేక చిన్న జంతువులు, పక్షులు, కీటకాలు చెట్లు, మొక్కలపై నివసించడం మరొక కారణం. ఆ జీవులు ఉదయం సమయంలో తిండి, పానీయాల ఏర్పాటు కోసం బయటకు వెళ్లి సాయంత్రం అలసిపోయిన తర్వాత విశ్రాంతి కోసం, నిద్ర కోసం చెట్లపైన కట్టిన గూడులకు తిరిగి వెళతారు. అటువంటి పరిస్థితిలో రాత్రివేళ చెట్లను, మొక్కలను తాకడం లేదా వాటి పువ్వులు, ఆకులను కోసే సమయంలో వాటి మీద ఉన్న జీవుల నిద్రకు భంగం కలుగుతుంది. కనుక రాత్రి సమయంలో చెట్లను, మొక్కలను తాకడం లేదా కట్ చేయడం  నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

సాయంత్రం లేదా రాత్రివేళ పూలను కట్ చేయకపోవడానికి మరొక మతపరమైన కారణం ఏమిటంటే చాలా వరకు పువ్వులు ఉదయం పూస్తాయి. సాయంత్రం సమయానికి అవి వాడిపోతాయి. దేవుళ్ళకు వాడిన పువ్వులను సమర్పించడం నిషేధం కనుక రాత్రి వేళ పువ్వులను కట్ చేయరు.

శాస్త్రీయ కారణం ఏమిటంటే..

సాయంత్రం తర్వాత చెట్లను, మొక్కలను తాకడం, వాటి పువ్వులు,యు ఆకులను కోయడం కూడా శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే తప్పుగా పరిగణించబడుతుంది. దీని వెనుక కారణం ఏమిటంటే పగటి సమయంలో  చెట్లు, మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అయితే రాత్రి సమయంలో చెట్లు, మొక్కలు ఆక్సిజన్‌కు బదులుగా కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అందువల్ల రాత్రివేళ చెట్లు, మొక్కల కిందకు వెళ్లడం వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అందుకే రాత్రిపూట చెట్లు, మొక్కల కింద పడుకోవడం నిషిద్ధం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..