క్షీణించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి ఆరోగ్యం!

రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రాణాధార వ్యవస్థపై ఆమెను ఉంచినట్లు బాధితురాలికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం రాజకీయపరంగా పెను దుమారానికి దారితీసింది. ఈ ఘటన వెనుక అత్యాచార నేరంలో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెనగర్‌ హస్తం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుల్‌దీప్‌ సెనగర్‌, ఆయన సోదరుడు మనోజ్‌ […]

క్షీణించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి ఆరోగ్యం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2019 | 6:39 PM

రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రాణాధార వ్యవస్థపై ఆమెను ఉంచినట్లు బాధితురాలికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం రాజకీయపరంగా పెను దుమారానికి దారితీసింది. ఈ ఘటన వెనుక అత్యాచార నేరంలో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెనగర్‌ హస్తం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుల్‌దీప్‌ సెనగర్‌, ఆయన సోదరుడు మనోజ్‌ సింగ్‌, మరో 8 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఉన్నావ్‌కు చెందిన బాధితురాలిపై ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెనగర్‌ అత్యాచారం చేశాడంటూ బాలిక తల్లి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం ఎదుట బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో ఈ కేసు సంచలనమైంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బాధితురాలి తండ్రి హత్యకు గురయ్యారు. దీంతో కేసు మరింత జటిలమైంది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతేడాది ఏప్రిల్‌లో కుల్‌దీప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.

ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. పిన్ని, మేనత్త, న్యాయవాదితో కలిసి రాయబరేలీకి వెళ్తుండగా.. వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె పిన్ని, మేనత్త అక్కడికక్కడే మరణించగా.. బాధితురాలు, న్యాయవాది ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.