సీఎం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. జీవనోపాధి కోల్పోయి పేదలు, పంటలకు ధరలు లేక రైతులు, వ్యాపారాలు దెబ్బతిని వర్తకులు పూర్తిగా కుదేలయ్యారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ నాయకులు కొందరు విరాళాల

సీఎం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 7:35 PM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. జీవనోపాధి కోల్పోయి పేదలు, పంటలకు ధరలు లేక రైతులు, వ్యాపారాలు దెబ్బతిని వర్తకులు పూర్తిగా కుదేలయ్యారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ నాయకులు కొందరు విరాళాల పేరుతో వేధించడం దుర్మార్గం అని మండిపడ్డారు. పేదలకు సహాయ చర్యల్లో కూడా వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడం హేయం అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం దుశ్చర్య వల్లే రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ ప్రభావం ఎక్కువ అవుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశావర్కర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం వైసీపీ నాయకులు మానుకోవాలి అని హితవు పలికారు. ప్రతి పేదకుటుంబానికి 5వేల రూపాయల సాయం అందించాలి, సరైన నిర్ణయాలు తీసుకుని విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా చంద్రబాబు తెలియజేశారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: అడవిలోనే వనవాసం చేస్తున్న కుటుంబం..

Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: 3.31 లక్షల పీఎఫ్ క్లైమ్స్ క్లియర్..