
Play For Black Caps : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు సంచలనంగా మారిపోయాడు. ఓ వైపై స్లెడ్జింగ్.. మరో వైపు చిత్కారాలు.. దీంతో పెద్ద ఎత్తున సూర్యకుమార్‌పై చర్చ జరుగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ మెరిసాడు.
దేశవాళీ పోటీల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ భారత జాతీయ జట్టులో మాత్రం అతడికి చోటు అందని ద్రాక్షగానే మారింది. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్, ఆ తర్వాత జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇటీవల భారత జట్టును ప్రకటించినప్పటికీ అందులో సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడంపై సర్వత్ర విమర్శలు పెరిగాయి. మరో వైపు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ కూడా సెలక్టర్లను ప్రశ్నించినట్లుగా వార్తలు గుప్పు మంటున్నాయి. ఇదే సమయంలో ఓ బిగ్ ఆఫర్ వచ్చింది.
అతడి ఆటతీరును చూసిన పలువురు క్రీడా నిపుణులు ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడి పేరు లేకపోవడంపై పెదవి విరిచారు. రెండుమూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ సెలక్టర్ల నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నాడు.
సూర్యకుమార్ ఆటకు ముగ్దుడైన న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ అతడికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. భారత సెలక్టర్లకు కనువిప్పు కలిగేలా కామెంట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే కనుక వెంటనే న్యూజిలాండ్ వచ్చేయాలని ఫన్నీగా పిలుపునిచ్చాడు.