మీ దగ్గర బిఎస్ 4 వెహికిల్ ఉందా? ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదా? ఇంకో 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మీ బండిని స్క్రాప్ కింద అమ్ముకోవాల్సిందే. కేంద్ర రవాణాశాఖ ఇచ్చిన గడువు సరిగ్గా మరో 30 రోజుల్లో ముగుస్తుంది. మార్చి 31 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలు నిలిచిపోనున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా బిఎస్ 6 వెహికిల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక ఏప్రిల్ 1 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలను అనుమతించరు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1 తరువాత బిఎస్ 6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
వాహనాల ఉద్గారాలలో పెరుగుతున్న CO2 స్థాయిలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2020 నుండి బిఎస్-6 ఇంధనాన్ని ఉపయోగించాలని ప్రకటించింది. బిఎస్-4 ఇంధనంలో సల్ఫర్ కంటెంట్ తో పోలిస్తే బిఎస్-6 ఇంధనంలో 20% వరకు తగ్గిపోతోంది. ఫ్యూయల్ లో ఉండే సల్ఫర్ కంటెంట్ డీజిల్ ఇంజిన్లలో ఇంజెక్టర్ ల యొక్క లూబ్రికేషన్ కు సాయపడుతుంది, అయితే, వాహనాల నుంచి ఎక్కువగా CO2 రావడానికి ఇది కూడా ప్రధాన కారణం. సల్ఫర్ కంటెంట్ తగ్గించడం వల్ల వేహికల్ లో ఉద్గారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
కాగా.. బిఎస్ 6 వాహనాలలో ఉండే కాంపోనెంట్ లు NOx ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఎగ్జాస్ట్ వాయువుల తగ్గిస్తూ పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడతాయి. డీజిల్ ఇంజిన్ కు చేసిన అన్ని మార్పులు ఫలితంగా తయారీ వ్యయాలు పెరగడం జరుగుతుంది.
అదేవిధంగా, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, అన్ని వాహనాలను (OBD) ఆన్ బోర్డ్ డయగ్నాస్టిక్స్ కొరకు ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసింది. బిఎస్-4 నుంచి బిఎస్-6 కి మారడానికి డీజిల్ వాహనాల నుంచి 70% వరకు తగ్గిన NOx లెవల్స్, పెట్రోల్ వాహనాల నుంచి 25% వరకు తగ్గడానికి కూడా సహాయపడతాయి.