పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

|

Apr 30, 2020 | 7:51 PM

దేశ రాజధానిలో భవ్యమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని, కేంద్ర సచివాలయానికి దివ్యమైన భవనాన్ని రూపొందించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మోకాలడ్డేందుకు ప్రయత్నించిన వారిని సుప్రీంకోర్టు మందలించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!
Follow us on

దేశ రాజధానిలో భవ్యమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని, కేంద్ర సచివాలయానికి దివ్యమైన భవనాన్ని రూపొందించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మోకాలడ్డేందుకు ప్రయత్నించిన వారిని సుప్రీంకోర్టు మందలించింది. భూ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త పార్లమెంటు నిర్మాణ ప్రాజెక్టును ఆపాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దానిని సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో కొత్త పార్లమెంట్ భవనాన్ని, కేంద్ర సచివాలయ భవనాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. దీనికోసం భూ వినియోగ మార్పిడి చేస్తూ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంటు నిర్మాణ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను గురువారం నాడు కొట్టివేసింది. కొత్త పార్లమెంటు భవనం, కొత్త కేంద్ర సచివాలయ భవనాల నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చంది.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు