తన మైనపు విగ్రహాన్ని ముందే చేయించుకున్న బాలు.. శిల్పితో ఏమన్నారంటే?

|

Sep 27, 2020 | 6:51 PM

దివికేగిన దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చనిపోయే ముందే తన మైనపు విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు.

తన మైనపు విగ్రహాన్ని ముందే చేయించుకున్న బాలు.. శిల్పితో ఏమన్నారంటే?
Follow us on

SP Bala Subrahmanyam Statue: దివికేగిన దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చనిపోయే ముందే తన మైనపు విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన రాజ్‌కుమార్ వడియార్‌తో తొలుత తన తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి విగ్రహాన్ని ఎస్పీ బాలు తయారు చేయించుకున్నారు. దాన్ని నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో ఆవిష్కరించారు.

ఆ సమయంలోనే నెల్లూరులోని తన ఇంట్లో.. ఆయన తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించాలని అనుకున్నారు. అందులో భాగంగానే వాటిని తయారు చేయమని ఎస్పీ బాలు శిల్పికి ఆర్డర్ ఇచ్చారు. ఆయన కోరిక మేరకు శిల్పి ఆ రెండు విగ్రహాలను తయారు చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగష్టులోనే వాటిని అవిష్కరించాల్సి ఉంది. కానీ ఈ లోపు ఎస్పీ బాలుకు కరోనా వైరస్ సోకింది.

తాజాగా శిల్పి వడియార్ మీడియాతో మాట్లాడుతూ ”బాలుతో నాకు ఎనిమిదేళ్ళ పరిచయం ఉంది. ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు తన మైనపు విగ్రహం చేయమని అడిగారు. అప్పుడే ఫోటో షూట్ చేసి.. నమూనా తయారు చేశాం. కొద్దిరోజుల క్రితం విగ్రహానికి తుది మెరుగులు దిద్దాం. జూన్ 4న ఎస్పీ బాలు పుట్టినరోజు. ఆ రోజు ఆయనకు ఈ విగ్రహాన్ని ఇవ్వాలని అనుకున్నా.. కాని అది కుదరలేదు. ఆ తర్వాత ఎస్పీ బాలు నాకు ఫోన్ చేసి.. ఇక్కడికి వచ్చి తన విగ్రహం చూస్తానని అన్నారు. కాని ఇంతలోనే ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. బాలు కోరిక మేరకు ఈ విగ్రహాన్ని చెన్నైలోని ఆయన నివాసానికి పంపిస్తాను’ అని పేర్కొన్నారు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..