పాస్టర్లకు జీతాలిస్తారా? తమాషా చేస్తున్నారా అంటున్న వీర్రాజు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిటిడి బోర్డు విషయంలో బిజెపి అభిమతమేంటనే అంశంపై కుండబద్దలు కొట్టారు వీర్రాజు. గతంలోను ఘాటు వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్‌ని షేక్ చేసిన వీర్రాజు తాజా వ్యాఖ్యలతో వైసీపీపై యుద్దాన్ని ప్రకటించినట్లయింది. సోము వీర్రాజు.. బిజెపిలో ఈయన వ్యాఖ్యలెప్పుడు సెన్సేషనల్ అవుతాయి. కొత్త రగడకు తెరలేపుతాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ-బిజెపి మధ్య అగాధం మరింత పెంచేవిగా వున్నాయి. ముఖ్యంగా టిటిడి […]

పాస్టర్లకు జీతాలిస్తారా? తమాషా చేస్తున్నారా అంటున్న వీర్రాజు
Follow us

|

Updated on: Nov 28, 2019 | 1:39 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిటిడి బోర్డు విషయంలో బిజెపి అభిమతమేంటనే అంశంపై కుండబద్దలు కొట్టారు వీర్రాజు. గతంలోను ఘాటు వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్‌ని షేక్ చేసిన వీర్రాజు తాజా వ్యాఖ్యలతో వైసీపీపై యుద్దాన్ని ప్రకటించినట్లయింది.

సోము వీర్రాజు.. బిజెపిలో ఈయన వ్యాఖ్యలెప్పుడు సెన్సేషనల్ అవుతాయి. కొత్త రగడకు తెరలేపుతాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ-బిజెపి మధ్య అగాధం మరింత పెంచేవిగా వున్నాయి. ముఖ్యంగా టిటిడి బోర్డు, పాస్టర్లకు, ఇమామ్‌లకు జీతాలివ్వడం వంటి అంశాల్లో వీర్రాజు వ్యాఖ్యలు కొత్త దుమారం రేపే సంకేతాలు కనిపిస్తున్నాయి.

టిటిడి బోర్డుని రాజకీయాలకు దూరంగా ఉంచి చైర్మన్లుగా మఠాధిపతులను లేదా స్వామీజీలనే నియమించాలని సోము వీర్రాజు విజయనగరంలో డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు టిటిడిని పూర్తిగా రాజకీయాలమయం చేశాయని, ప్రస్తుతం జగన్ కూడా అదే విధంగా టిటిడిని రాజకీయమయం చేస్తున్నారని వీర్రాజు అంటున్నారు.

అదే సమయంలో పాస్టర్లకు, ఇమామ్‌లకు ప్రజాధనంతో వేతనాలివ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఆ సాహసాన్ని చేయకపోవచ్చంటున్నారు వీర్రాజు. క్రైస్తవ ఫాస్టర్లకు ప్రజాధనాన్ని ఇస్తామనడం సరికాదని, హిందూ పూజార్లకు జీత భత్యాలను ఎండోమెంట్ శాఖ, హిందూ దేవాలయాల ఆస్తుల ద్వారా ఇస్తున్నప్పుడు ప్రభుత్వ ధనంతో పాస్టర్లకు, ఇమామ్‌లకు వేతనాలు ఎలా ఇస్తారని వీర్రాజు ప్రశ్నించారు. పాస్టర్లకి శాలరీలు ఇవ్వాలంటే క్రైస్తవ సంస్థల ఆస్తుల నుండి ఇవ్వాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై మండిపాటు

సోము వీర్రాజు చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకులుపయోగించే భాష సరిగ్గా వుండాలంటున్న చంద్రబాబు గతంలోను తాను, తన టిడిపి నేతలు మాట్లాడిన మాటలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. చాలా మంది టిడిపి నేతలు బిజెపికి టచ్‌లో ఉన్న మాట వాస్తవమని, పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని వీర్రాజు చెబుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నామన్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..