ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్… ఇంత‌కుమించి డబ్బులు విత్‌డ్రా చేశారంటే..

అతిపెద్ద దేశీయ‌ బ్యాంక్ ఎస్‌బీఐలో మీకు ఖాతా ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారా? . అయితే మీరు కొన్ని వివ‌రాలు తెలుసుకోవాలి.

ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్... ఇంత‌కుమించి డబ్బులు విత్‌డ్రా చేశారంటే..
Follow us

|

Updated on: Jul 06, 2020 | 2:09 PM

అతిపెద్ద దేశీయ‌ బ్యాంక్ ఎస్‌బీఐలో మీకు ఖాతా ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారా? . అయితే మీరు కొన్ని వివ‌రాలు తెలుసుకోవాలి. బ్యాంక్ నుంచి మీరు తీసుకునే డబ్బులు ఒక ప‌రిమితి దాటితే ట్యాక్స్ కట్టాల్సి రావొచ్చు. ఒక సంవ‌త్స‌ర పరిధిలో ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.20 లక్షలకు పైన విత్‌డ్రా చేసేవారు ఈ అల‌ర్ట్ తెలుసుకుంటే బెట‌ర్. గత మూడేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయకుండా, ఏడాదికి రూ.20 లక్షలపైన డబ్బులు విత్‌డ్రా చేస్తుంటే.. మీరు త‌ప్ప‌నిస‌రిగా టీడీఎస్ చెల్లించాలి. బ్యాంక్ 194ఎన్ సెక్షన్ కింద మీ ఖాతా నుంచి టీడీఎస్‌ను కట్ చేసుకుంటుంది.స్టేట్ బ్యాంక్ తాజాగా తన సోష‌ల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

ఈ క్ర‌మంలో ఖాతాదారులు పాన్ కార్డు వివరాలను బ్యాంక్‌కు అందించాలి. ఇప్పటికే పాన్ కార్డు అందించి ఉంటే మళ్లీ ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఎక్కువ ట్యాక్స్ క‌ట్టాల్సిరావొచ్చు. రూ.20 లక్షల లోపు డబ్బులు తీసి, పాన్ కార్డు ఇవ్వకపోతే ఎలాంటి ఇంట్ర‌స్ట్ కట్టక్కర్లేదు. అదే రూ.కోటి వరకు డబ్బులు విత్‌డ్రా చేసి పాన్ కార్డు ఇస్తే 2 శాతం టీడీఎస్, పాన్ కార్డు ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ చార్జ్ చేస్తారు. అదే రూ.కోటికి పైగా డబ్బులు తీసుకుని పాన్ కార్డు ఇస్తే 5 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ పాన్ ఇవ్వకపోతే మాత్రం 20 శాతం టీడీఎస్ పడుతుంది.

Latest Articles