Fuel Price: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయా.? దానికి కారణం ఇదేనా.?

|

Jun 10, 2022 | 11:16 AM

Fuel Price: మొన్నటి వరకు ఆకాశన్నంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ మధ్య కాస్త శాతించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సుమారు రూ. 10 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, రోజువారిగా కూడా ధరలు పెరగడకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చాయి...

Fuel Price: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయా.? దానికి కారణం ఇదేనా.?
Petrol Diesel Price Today
Follow us on

Fuel Price: మొన్నటి వరకు ఆకాశన్నంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ మధ్య కాస్త శాతించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సుమారు రూ. 10 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, రోజువారిగా కూడా ధరలు పెరగడకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చాయి. అయితే ఇది మున్నాళ్ల ముచ్చటేనా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగగా, ఇప్పుడు మరో అంశం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడానికి కారణంగా మారనుంది. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యా విధించిన నిబంధనలనే కారణంగా మారనున్నాయి.

భారత్‌కు చౌకగా ముడి చమురు ఇవ్వడానికి రష్యా నిరాకిరించింది. భారత్‌కు చెందిన రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పిసిఎల్) రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌తో చాలా కాలంగా జరుగుతోన్న చర్చలు విఫలమయ్యాయి. అంతేకాకుండా చమురు ధర 13 వారాల గరిష్టానికి చేరుకోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించడం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

గురువారం క్రూడ్‌ ఆయిల్ ధర ఏకంగా 124 డార్లకు చేరింది. ఇది 13 వారాల గరిష్టం కావడం గమనార్హం. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో చమురు కంపెనీలు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ నష్టానంతా వినియోగదారుల నుంచే వసూలు చేయనున్నారని మార్కె్‌ట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ భారం పడడం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు చౌకగా ముడి చమురు లభించకపోతే ధరలు పెరగడం అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే చౌకగా ముడి చమురు కోసం రష్యన్‌ కంపెనీతో ఇండియన్‌ ఆయిల్‌ 6 నెలల ఒప్పందం చేసుకోగలిగింది. దీని ప్రకారం ఇండియన్ ఆయిల్ ప్రతి నెలా 6 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా చమురు కంపెనీ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..