రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు భారీ దెబ్బ

ఐపీఎల్ 2020 సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్ జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిషాంత్ యగ్నిక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారన అయ్యిందని రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. కోచ్ దిషాంత్ యగ్నిక్ ప్రస్థుతం...

రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు భారీ దెబ్బ
Follow us

|

Updated on: Aug 12, 2020 | 2:28 PM

ఐపీఎల్ 2020 సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్ జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిషాంత్ యగ్నిక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారన అయ్యిందని రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. కోచ్ దిషాంత్ యగ్నిక్ ప్రస్థుతం తన స్వస్థలమైన ఉదయపూర్ లో ఉన్నారని తెలిపింది. అతనికి కరోనా రావడంతో ఆసుపత్రిలో చేరి 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రాంచైజీ సూచించింది. జట్టు సభ్యులెవరూ కోచ్ తో సన్నిహితంగా లేరని ప్రాంచైజీ నిర్వాహకులు వెల్లడించారు.

ఇక ఐపీఎల్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లేందుకు రాజస్థాన్ రాయల్ క్రికెట్ జట్టు సభ్యులు వచ్చేవారం ముంబైలో కలుసుకుంటారు. రాజస్థాన్ రాయల్ ఫ్రాంచైజీ క్రికెట్ క్రీడాకారులతోపాటు సిబ్బందికి రెండు సార్లు కరోనా పరీక్షలు చేయాలని బీసీసీఐ సిఫార్సు చేసింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వతేదీ వరకు ఐపీఎల్ మ్యాచ్ లు యూఏఈలో జరగనున్నాయి. రాజస్థాన్ రాయల్ జట్టు కోచ్ దిషాంత్ కు నెగిటివ్ వచ్చాక ఆరు రోజుల తర్వాత మూడు సార్లు పరీక్షల్లో నెగిటివ్ వస్తే యూఏఈకి వెళ్లేందుకు అనుమతిస్తామని ప్రాంచైజీ అధికారులు చెప్పారు.