ఏకంగా రూ. 3 కోట్ల 86 లక్షల బకాయిలు..పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయానికి పవర్‌ కట్..ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు‌

పుట్టపర్తి మున్సిపాలిటీకి విద్యుత్‌ శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కార్యాలయానికి పవర్‌ కట్‌ చేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది చీకట్లో ఉండాల్సి వచ్చింది.

ఏకంగా రూ. 3 కోట్ల 86 లక్షల బకాయిలు..పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయానికి పవర్‌ కట్..ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు‌
Follow us

|

Updated on: Dec 22, 2020 | 2:09 PM

పుట్టపర్తి మున్సిపాలిటీకి విద్యుత్‌ శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కార్యాలయానికి పవర్‌ కట్‌ చేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది చీకట్లో ఉండాల్సి వచ్చింది. కరెంట్ లేకపోవడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏళ్ల తరబడి కోట్లలో పేరుకుపోయిన విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి విద్యుత్‌ సరఫరా పునరుద్దరిస్తామని అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవటంతో పవర్‌ కట్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు ఇప్పటి వరకు రూ. 3కోట్ల 86 లక్షల దాకా చేరుకుందని వివరించారు. 40 శాతం బకాయిలు చెల్లించాలని పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు చెప్పిన్నప్పటికీ పట్టించుకోలేదని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలో కరెంట్‌ లేకపోవడంతో ఆఫీసంతా చీకటిగా మారింది. అధికారులు చేసేది లేక బయటకి వెళ్లిపోయారు. కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి.

Also Read :

కరోనా సమయంలోనూ భారీ కానుకలు..అన్నవరం సత్యదేవుని దేవస్థాన కార్తిక మాస ఆదాయం ఎంతో తెలుసా..?

Lpg Gas Price: కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..