‘ఈ పది రాష్ట్రాలూ కరోనాను ఓడిస్తే, ఇండియాదే విజయం, ప్రధాని మోదీ

ఇండియాలో ప్రధానంగా 10 రాష్ట్రాలు కోవిడ్ ను 'ఓడించిన పక్షంలో'  ఈ వైరస్ పై మన దేశానిదే విజయమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చించారు.

'ఈ పది రాష్ట్రాలూ కరోనాను ఓడిస్తే, ఇండియాదే విజయం, ప్రధాని మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 3:03 PM

ఇండియాలో ప్రధానంగా 10 రాష్ట్రాలు కోవిడ్ ను ‘ఓడించిన పక్షంలో’  ఈ వైరస్ పై మన దేశానిదే విజయమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చించారు. దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో ఈ రాష్ట్రాల్లోని కేసులే 80 శాతం పైగా ఉన్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, బిహార్, గుజరాత్, యూపీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చించారు.

ఈ రాష్ట్రాలు కోవిడ్ ని ఓడిస్తే చాలు.. ఇండియా విజయం సాధించినట్టే అని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రతో బాటు ఏపీ, తమిళనాడు, కర్నాటక, యూపీలో మరణాల కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు…. కరోనా వైరస్ పరిస్థితిపై -మోదీ . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో చర్చించడం ఇది ఏడో సారి.