కోడికేదీ బస్ టికెట్..? రూల్ ఉందిగా..!

ప్రభుత్వ వాహనాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవలసిందే. ఇదే కోవలో కోడికి టికెట్ తీయలేదని ఓ వ్యక్తికి రూ.500ల ఫైన్ వేసింది కర్ణాటక ఆర్టీసీ. ఈ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ విషయం తెలియని ఈ వ్యక్తి, మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. […]

కోడికేదీ బస్ టికెట్..? రూల్ ఉందిగా..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 2:43 PM

ప్రభుత్వ వాహనాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవలసిందే. ఇదే కోవలో కోడికి టికెట్ తీయలేదని ఓ వ్యక్తికి రూ.500ల ఫైన్ వేసింది కర్ణాటక ఆర్టీసీ. ఈ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ విషయం తెలియని ఈ వ్యక్తి, మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. తనైతే టికెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. అయితే.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్టీసీ చెకింగ్ డిపార్ట్ మెంట్ కోళ్లకు టికెట్ తీయలేదని ఆ వ్యక్తికి ఫైన్ విధించారు. దీంతో.. చేసేదేమీ లేక ఫైన్ చెల్లించాడా ఆసామీ.

Latest Articles