కొత్త రాజ్యసభలో ఇక ‘ కురు వృధ్ధుడు ‘ మిస్ !

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ ఇక నూతన పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో కనిపించబోరు. రాజ్యసభ సభ్యుడిగా దాదాపు 30 ఏళ్ళ ఆయన సుదీర్ఘ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. 2008 లో దేశాన్ని ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ ను తొలి సారిగా రాజ్యసభ మిస్ కానుంది. 1991 లో అస్సాం నుంచి ఈయన మొదటిసారి ఎగువసభకు ఎన్నికయ్యారు. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ బలం అతి తక్కువగా […]

కొత్త రాజ్యసభలో ఇక ' కురు వృధ్ధుడు '  మిస్ !
Follow us

|

Updated on: Jun 16, 2019 | 2:35 PM

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ ఇక నూతన పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో కనిపించబోరు. రాజ్యసభ సభ్యుడిగా దాదాపు 30 ఏళ్ళ ఆయన సుదీర్ఘ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. 2008 లో దేశాన్ని ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ ను తొలి సారిగా రాజ్యసభ మిస్ కానుంది. 1991 లో అస్సాం నుంచి ఈయన మొదటిసారి ఎగువసభకు ఎన్నికయ్యారు. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ బలం అతి తక్కువగా ఉన్న విషయం గమనార్హం. దీంతో తిరిగి అదే స్టేట్ నుంచి ఎన్నిక కాలేకపోయారు. (అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 25 మాత్రమే). మొదటి ప్రాధాన్యతా ఓట్లు 43 అవసరం కాగా.. వీరి సంఖ్య ఇంత పరిమితంగా ఉండడం..మన్మోహన్ కు కలిసి రాలేదు. రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ పంపలేకపోయింది. అస్సాంతో బాటు ఒడిశా, తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో తొమ్మిది సీట్లు ఖాళీ అయినప్పటికీ.. మన్మోహన్ సింగ్ కు ‘ అదృష్టం ‘ దక్కలేదు. గుజరాత్ లో తప్ప ఈ రాష్ట్రాల్లో వీటిలోనూ రాజ్యసభ సభ్యత్వానికి అవసరమైనన్ని’ బెర్తులు ‘కాంగ్రెస్ పార్టీకి లేవు. అస్సాం నుంచి ఏజీపీ నేత బీరేంద్ర ప్రసాద్, బీజేపీకి చెందిన కామాఖ్య ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒడిశాలో నాలుగు, తమిళనాడులో ఒకటి, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లేదా పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎగువసభకు మన్మోహన్ ను పంపవచ్చునని, కానీ ఈ స్టేట్స్ లో ఖాళీలు లేవని తెలుస్తోంది. మరో నేతనెవరినైనా రాజీనామా చేయించి ఆ స్థానంలో మన్మోహన్ ను ఎన్నుకోవచ్ఛు..అయితే అలాంటి ప్రస్తావనేదీ పార్టీలో రాలేదు. సుమారు 28 ఏళ్ళ పాటు రాజ్యసభ ఎంపీగా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు. ఏడేళ్ల పాటు చైర్మన్ గా,ఆరేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. చివరిసారి 2013 లో ఎగువసభకు ఎన్నికయ్యారు. ఇదిలాఉండగా.. బీహార్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు బై పోల్ షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. నోటిఫికేషన్ ను ఈ నెల 18 న జారీ చేస్తామని, జులై 5 న ఎన్నికలు, ఓటింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. గుజరాత్ నుంచి హోమ్ మంత్రి అమిత్ షా, అదే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీహార్ నుంచి మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఒడిశా నుంచి అచ్యుతానంద సమంత లోక్ సభకు ఎన్నిక కావడంతో వీరి రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి.