బ్రేకింగ్….ముషారఫ్ మరణ శిక్ష రద్దు..

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణశిక్షను పాక్ హైకోర్టు రద్దు చేసింది. దేశద్రోహానికి పాల్పడ్డాడని, ఇందుకు దోషి అని గత ఏడాది స్పెషల్ కోర్టు ఇఛ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుధ్ధమని, చెల్లవని లాహోర్ హైకోర్టు పేర్కొంది. తన క్లయింటుకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ ఆయన తరఫు లాయర్ వేసిన పిటిషన్ ను ఈ హైకోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం విచారించింది. ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు చట్ట నిబంధనల ప్రకారం లేదని ఈ […]

బ్రేకింగ్....ముషారఫ్ మరణ శిక్ష రద్దు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2020 | 6:55 PM

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణశిక్షను పాక్ హైకోర్టు రద్దు చేసింది. దేశద్రోహానికి పాల్పడ్డాడని, ఇందుకు దోషి అని గత ఏడాది స్పెషల్ కోర్టు ఇఛ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుధ్ధమని, చెల్లవని లాహోర్ హైకోర్టు పేర్కొంది. తన క్లయింటుకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ ఆయన తరఫు లాయర్ వేసిన పిటిషన్ ను ఈ హైకోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం విచారించింది. ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు చట్ట నిబంధనల ప్రకారం లేదని ఈ ధర్మాసనం అభిప్రాయపడింది. 2007 లో రాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశంలో ఎమర్జన్సీ విధించారని ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది. దీనిపై 2013 నుంచి కోర్టులో వాదోపవాదనలు కొనసాగుతూ వచ్చాయి.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన స్వేఛ్చా జీవి అని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు ఉండదని  ముషారఫ్ తరఫు న్యాయవాది అన్నారు.

Latest Articles