పుల్వామా ఘటనపై విమర్శలు, విపక్షాల అపాలజీకి బీజేపీ డిమాండ్

పుల్వామా  దాడిపై విమర్శలు చేస్తూ, అనుమానాలు వ్యక్తం చేసినందుకు విపక్షాలు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఎటాక్ నేపథ్యంలో వారు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.

  • Publish Date - 2:09 pm, Sat, 31 October 20 Edited By: Anil kumar poka
పుల్వామా ఘటనపై విమర్శలు, విపక్షాల అపాలజీకి బీజేపీ డిమాండ్

పుల్వామా  దాడిపై విమర్శలు చేస్తూ, అనుమానాలు వ్యక్తం చేసినందుకు విపక్షాలు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఎటాక్ నేపథ్యంలో వారు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటన ఎవరికి ప్రయోజనకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని, బాలాకోట్ లో జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాల మీద భారత జవాన్ల బాంబు దాడులపైనా అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ మంత్రి ఒకరు బాహాటంగా అంగీకరించినా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందనే కరువైందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇండియాలో ఉగ్రదాడులకు పాకిస్థానే కారణమని విపక్షాలు నమ్ముతున్నాయా లేదా అని ఆయన ప్రశ్నించారు. . టెర్రరిస్టు దాడుల వెనుక కుట్ర దాగి ఉందన్న వ్యాఖ్యకు రాహుల్, ఇతర ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా డిమాండ్ చేశారు.