ఎన్టీఆర్ హిట్ చిత్రానికి 14 ఏళ్లు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న మూవీ హ్యాష్ టాగ్.

| Edited By: Pardhasaradhi Peri

Dec 22, 2020 | 6:04 PM

ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ చిత్రం 14 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు 2006లో (డిసెంబర్22) విడుదలైన విషయం తెలిసిందే...

ఎన్టీఆర్ హిట్ చిత్రానికి 14 ఏళ్లు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న మూవీ హ్యాష్ టాగ్.
Follow us on

Ntr Rakhi completes 14 years: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన సినిమా ‘రాఖీ’. 2006లో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా ద్వారా జూనియర్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు 2006లో (డిసెంబర్22) విడుదలైన విషయం తెలిసిందే. మహిళలపై జరుగుతోన్న పాశవిక దాడులను ఈ సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో ఎన్టీఆర్ తనదైన డైలాగ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా ట్విటర్‌లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఉదయం నుంచి ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ సందడి చేస్తున్నారు.