కేరళ బ్యాంకుల్లో ఎన్నారైల సొమ్ము.. ఎంతో తెలుసా..!

ఎన్నారైలు విదేశాల్లో సంపాదించిన సొమ్ము దాచుకోడానికి భారీ మొత్తంలో స్వ‌దేశానికి త‌ర‌లిస్తుంటారు. కేరళలోని బ్యాంకుల్లో ఎన్నారైల డిపాజిట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఎన్నారైలే

కేరళ బ్యాంకుల్లో ఎన్నారైల సొమ్ము.. ఎంతో తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 1:37 PM

NRI deposits in Kerala: ఎన్నారైలు విదేశాల్లో సంపాదించిన సొమ్ము దాచుకోడానికి భారీ మొత్తంలో స్వ‌దేశానికి త‌ర‌లిస్తుంటారు. కేరళలోని బ్యాంకుల్లో ఎన్నారైల డిపాజిట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఎన్నారైలే కేర‌ళ‌లోని వివిధ బ్యాంకుల్లో దాచిపెట్టిన సొమ్ము రెండు ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. తాజాగా బ్యాంకులు ప్ర‌క‌టించిన వివ‌రాల ప్రకారం ఎన్నారైల మొత్తం డిపాజిట్లు రూ. 1,99,711.27 కోట్లు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇలా ఎన్నారైలు ఒక రాష్ట్రం బ్యాంకుల్లో దాచిపెట్టిన సొమ్ము రెండు ల‌క్ష‌ల కోట్ల మార్కును దాట‌డం ఇదే తొలిసారి. రాష్ట్రాస్థాయి బ్యాంక‌ర్స్ క‌మిటీ నివేదిక ప్ర‌కారం ఎన్నారైల వార్షిక డిపాజిట్లు 7.19 శాతానికి పెరిగిన‌ట్లు తెలిసింది.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం.. 

Latest Articles