యూజర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చిన వాట్సాప్.. వచ్చే ఏడాది నుంచి వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదా?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. అయితే ఈసారి తన యూజర్లకు షాక్ ఇవ్వబోతుంది. ఏంటీ ఆ షాక్ అనుకుంటున్నారా? అదేం లేదండీ. వచ్చే

యూజర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చిన వాట్సాప్.. వచ్చే ఏడాది నుంచి వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదా?
Follow us

|

Updated on: Dec 04, 2020 | 4:28 PM

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఫేస్‏బుక్, ఇన్‏స్టా వంటి యాప్స్ కంటే వాట్సాప్‏కు యూజర్లు అత్యధికం. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను తీసుకువస్తూ యూజర్లకు అందుబాటులో ఉంటుంది వాట్సాప్. అయితే ఈసారి మాత్రం తన యూజర్లకు షాక్ ఇవ్వబోతుంది. ఏంటీ ఆ షాక్ అనుకుంటున్నారా? అదేం లేదండీ. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే కొత్త టర్మ్స్ అండ్ కండీషన్స్‏ను అంగీకరించని యూజర్ల ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. కాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది. అందులో కొత్త టర్మ్స్ అండ్ కండీషన్స్‏ను అంగీకరించండి లేదా మీ అకౌంట్‏ను డిలీట్ చేసుకోండి అని ఉంది.

అంతే కాకుండా ఈ స్క్రీన్ షాట్ ప్రకారం వాట్సాప్ కొత్త అప్‏డేట్ సమాచారంతో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‏బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఫేస్‏బుక్ కు సంబంధించిన అన్ని రకాల సేవలతోపాటు, ఛాటింగ్ సమాచారాన్ని, వ్యాపారాలకు దీన్ని ఎలా ఉపయోగిస్తారనేది కూడా అందులో తెలియజేయనున్నట్లు తెలిపింది. అలాగే 2021 ఫిబ్రవరి 8 తర్వాత కూడా యూజర్లు వాట్సాప్‏ను ఉపయోగించాలనుకుంటే కొత్త ఫీచర్స్‏ను అంగీకరించాలి లేదంటే మీ అకౌంట్ డిలీట్ అవుతుందని అందులో పేర్కోంది. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిపింది.

2014లో ఫేస్‏బుక్ 19 బిలియన్ డాలర్ల ఒప్పందంతో వాట్సాప్‏ను కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఇది ఎలా పనిచేస్తుందనే విషయంపై వాట్సాప్ అనేక విమర్శలను ఎదుర్కొంది. యూజర్ల గోప్యత, డేటా భద్రతా గురించి అనేక విమర్శల మధ్య 2018లో వాట్సాప్ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారు. వాట్సాప్‏ను ఫేస్‏బుక్ అమ్మకానికి ముందు జాన్ కౌమ్ “ఈరోజుల్లో కంపెనీలు మీ గురించి, మీ స్నేహితులు, మీ ఆసక్తుల గురించి ప్రతీ విషయం తెలుసు, మరియు వారు ప్రకటనల అమ్మకం కోసం ఇవన్నీ ఉపయోగిస్తారు” అని తన బ్లాగ్ పోస్ట్‏లో రాశారు.

ఇంకా చదవండి: